నా కోరిక తీర్చు... నగ్న ఫోటోలతో స్కూల్‌ టీచర్‌కు బెదిరింపులు... మాజీ కార్పొరేటర్ అరెస్ట్

స్కూల్ టీచర్‌పై లైంగిక దాడికి పాల్పడి ఫోటోలు, వీడియోలు తీసిన ఓ మాజీ కార్పొరేటర్.... రెండేళ్ల తరువాత మళ్లీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: April 10, 2019, 7:01 PM IST
నా కోరిక తీర్చు... నగ్న ఫోటోలతో స్కూల్‌ టీచర్‌కు బెదిరింపులు... మాజీ కార్పొరేటర్ అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 7:01 PM IST
నేవీ ముంబైలోని ఓ రాజకీయ నేత స్కూల్ టీచర్ పట్ల అరాచకంగా వ్యవహరించారు. ఆమెపై లైంగిక దాడి చేసి... అందుకు సంబంధించిన వీడియోలు, ఆమె నగ్న ఫోటోలను తీశాడు. వాటిని తన ఫోన్‌లో సేవ్ చేసుకున్న అతగాడు... రెండేళ్ల తరువాత మరోసారి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నవీ ముంబైకు చెందిన మాజీ కార్పొరేటర్ రామశిష్ యాదవ్ ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. 2017లో మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను లైంగికంగా వేధించిన రామశిష్... అప్పటి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఆమెను ఏదో రకంగా వేధించడం మొదలుపెట్టిన రామశిష్... తనతో శృంగారానికి సహకరించపోతే అప్పటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించాడు. నిందితుడికి రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో... చాలాకాలం పాటు అతడి వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తోంది బాధితురాలు. అయితే నిందితుడి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాధితురాలు... చివరకు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం తెలిపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే అందులోని ఫోటోలు, వీడియోలను అతడు డిలీట్ చేయడంతో... ఆధారాలను సేకరించడం కోసం ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం తమ కస్టడీకి తీసుకున్నారు.First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...