మహిళల ముందుకు నగ్నంగా వచ్చిన కానిస్టేబుల్... వాళ్లు ఏం చేశారంటే...

Mumbai Crime : మనకు తెలియని చట్టాలు, సెక్షన్లూ చాలా ఉంటాయి. అలాంటి కొన్ని ఈ కేసులో ఉపయోగించాల్సి వచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 12:38 PM IST
మహిళల ముందుకు నగ్నంగా వచ్చిన కానిస్టేబుల్... వాళ్లు ఏం చేశారంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబైలోని నెహ్రూ నగర్‌లో మహిళల ముందు నగ్నంగా నిలబడిన కానిస్టే‌బుల్‌ని అరెస్టు చేసి... తిరిగి బెయిల్ ఇచ్చి... డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించారు పోలీసు ఉన్నతాధికారులు. అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందన్నది తేలాల్సిన అంశం. ఏం జరిగిందంటే... హరీష్ చంద్ర లహానే... ఓ కానిస్టేబుల్. నెహ్రూ నగర్‌లో గత పదేళ్లుగా ఉంటున్నాడు. మే 10న తను ఉండే అపార్ట్‌మెంట్ పైన... కామన్ బాల్కనీలోకి వెళ్లాడు. జనరల్‌గా అక్కడకు మగాళ్లతోపాటూ... మహిళలు కూడా వస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో కాస్త చల్ల గాలి తగులుతుందని మహిళలు పెద్ద సంఖ్యలో బాల్కనీపైకి వచ్చి, సేద తీరుతున్నారు. ఐతే... హరీష్ చంద్ర లహానే వచ్చినా మహిళలు అతన్ని పట్టించుకోలేదు. బాల్కనీ వదిలి కిందకు వెళ్లలేదు. తాను కానిస్టేబుల్‌ని అనీ, తాను రాగానే మహిళలు ఎవరైనా సరే... బాల్కనీ వదిలి కిందకు వెళ్లిపోవాలన్నది అతని ఆలోచన. ఇదివరకు రెండు మూడుసార్లు ఇలాగే మహిళల్ని బెదిరించి కిందకు పంపేశాడు. ఈసారి అతని ఆటలు సాగలేదు. ఈ అపార్ట్‌మెంట్‌లో మీకు ఎన్ని హక్కులు ఉన్నాయో, మాకూ అన్నీ ఉన్నాయి అంటూ మహిళలు అక్కడే కూర్చున్నారు. మీ సంగతి ఇలా ఉందా... ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ కిందకు వెళ్లాడు.

బాల్కనీ కిందనే అతని గది. తన రూంలోకి వెళ్లి... ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేశాడు. చిన్న పీలిక కూడా లేకుండా నగ్నంగా తయారై... గబగబా మెట్లు ఎక్కి... మహిళల ముందు ఏ మాత్రం సిగ్గు లేకుండా నిల్చున్నాడు. పైగా... ఇప్పుడు ఎంత సేపు ఉంటారో ఉండని మీ ఇష్టం అన్నాడు. అంతే... వాళ్లంతా... ఛీ సిగ్గులేని జన్మ అంటూ అక్కడి నుంచీ కిందకు వెళ్లిపోయారు. ఇకపై ఎప్పుడు పైకి వచ్చినా ఫ్రీ షో చూపిస్తా అంటూ బెదిరించాడు.

అతని తిక్క కుదర్చాలని డిసైడైన మహిళలు... స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసి... హరీష్ చంద్రను రకరకాల సెక్షన్ల కింద అరెస్టు చేశారు. అవేంటంటే... సెక్షన్ 354 (A) - సెక్సువల్ కలర్ కామెంట్స్ - లైంగిక వేధింపుల కింద లెక్క), సెక్షన్ 509 (బూతులు, బూతు సైగలు, మహిళల గౌరవాన్ని కించపరచడం). ప్రస్తుతం అతనికి బెయిల్ ఇచ్చి, అంతర్గత దర్యాప్తుకి ఆదేశించారు.

 ఇవి కూడా చదవండి :

సెక్స్ లేకుండా ఎలా ఉంటావ్... లేడీ పైలట్‌కి సీనియర్ లైంగిక వేధింపులు...


నన్ను చంపేస్తున్నారు... కాపాడండి... కేటీఆర్‌కు గల్ఫ్‌లో బాధితుడి కన్నీటి ఆవేదన...
Loading...

నిజామాబాద్‌కి మరో మణిహారం... పూర్తికావచ్చిన నేచర్ పార్క్...


అమెరికాలో కూతుర్ని చంపేసిన సవతి తల్లి... శవాన్ని బాత్‌టబ్‌లో నగ్నంగా పడేసి...
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...