Home /News /crime /

POLICEMAN BOOKED FOR ATTACKING WOMEN IN COIMBATORE SU

పట్టించుకోలేదనే కోపం.. ఇళ్లు మారిన మహిళను వదలని పోలీసు.. మరీ ఇంత దారుణమా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎస్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తికి.. ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్తతో విడిపోయి.. కొడుకుతో కలిసి ఉంటుంది. వీరిద్దరి పరిచయం కొన్నాళ్లు బాగానే సాగింది.

    భర్తతో విడిపోయిన మహిళతో పరిచయం పెంచుకున్న పోలీసు.. తనను పట్టించుకోవడం లేదన కోపంతో ఆమె దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు.. వెల్లలూరుకు చెందిన కే పార్తిబన్‌ రేస్ కోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పార్తిబన్‌కు కొద్ది రోజుల క్రితం.. అతడి బంధువైన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్తతో విడిపోయి.. వరదరాజపురంలో కొడుకుతో కలిసి ఉంటుంది. విడాకుల కోసం వేచిచూస్తుంది. వీరిద్దరి పరిచయం కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే ఆ తర్వాత ఆ మహిళ.. పార్తిబన్‌ను దూరం పెట్టింది. అతనికి చెప్పకుండా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారింది.

    మరోవైపు ఇంతకాలం తనతో బాగానే ఉన్న మహిళ ఇలా చేయడంతో పార్తిబన్ కోసం పెంచుకున్నాడు. ఆమె తనను పట్టించుకోవడం లేదని భావించాడు. ఈ క్రమంలోనే ఆమె కొత్త ఇళ్లు ఎక్కడో ఉందో తెలుసుకనే ప్రయత్నం చేశాడు. ఆమె ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకని అక్కడికి వెళ్లాడు. పోలీస్ డ్రెస్‌లోనే మహిళ ఇంటికి వెళ్లిన పార్తిబన్.. అక్కడ వీరంగం సృష్టించాడు. మహిళను బూతులు తిట్టడమే కాకుండా, ఆమెపై దాడి కూడా చేశాడు.

    ఇక, సింగనల్లూరులోని ఉజవర్ సంధై వద్ద క్యాంటీన్ నడుపుతున్న మహిళ తండ్రి స్కూటర్‌ను గురువారం రాత్రి కాంపౌండ్ లోపల పార్క్ చేశాడు. అయితే పార్థిబన్ కాంపౌడ్ లోనికి వచ్చి.. శుక్రవారం తెల్లవారుజామున స్కూటర్‌ను తగలబెట్టాడు. ఇందుక సంబంధించి ఆ మహిళన.. పోలీసులను ఆశ్రయించింది. పార్తిబన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక, పార్తిబన్.. మహిళపై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పార్తిబన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు