Home /News /crime /

POLICE WOMAN BECOME A FRIEND TO RAPE ACCUSED ON FACEBOOK VRY

Delhi : రేప్‌ నిందితుడికి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌గా మారిన మహిళ సీఐ...ఆ తర్వాత గురుడికి చుక్కలే...

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

Delhi : ఓ రేపిస్టును పట్టుకునేందుకు మహిళ సబ్‌ఇన్‌స్పెక్టర్ వాడికి ఫేస్‌బుక్ ద్వారా ఫ్రేండ్‌గా మారింది.. వాడితో. చాటింగ్ చేస్తూ... నమ్మించింది.. పర్సనల్‌గా కలుద్దామని ఫోన్ చేసిన నిందితుడిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది..

    ఓ గాజుల దుకాణంలో పని చేసే యువకుడు అమ్మాయిలను లైంగికంగా వాడుకోని వదిలేయడమే హాబిగా పెట్టుకున్నాడు..సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో వివిధ పేర్లతో ప్రొఫైల్స్ క్రియోట్ చేశాడు.. ఆ తర్వాత తన దారిలోకి వచ్చిన యువతును నమ్మించే విధంగా చాటింగ్ చేసేవాడు..ఇలా చాలా మందిని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడు..

    ఇదే విధంగా ఢిల్లీకి చెందిన ఓ పదహారు సంవత్సరాల యువతిని లైగికంగా ఉపయోగించుకున్నాడు.. ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేశారు. అమ్మాయి రేప్‌కు గురయిందని ఫిర్యాదు చేశారు. ఇక కేసును నమోదు చేసుకున్న స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక సైని విచారణ మొదలు పెట్టింది.

    విచారణలో భాగంగా తనకు ఇంటికి సమీపంలో ఉండే ఓ యువకునితో కొద్ది రోజుల క్రితం స్నేహం ఏర్పడిందని అనంతరం వారిద్దరు లైంగికంగా కలిసినట్టు బాధితురాలు ఒప్పుకుంది. అయితే ఆ తర్వాత అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాడని చెప్పింది. గర్భం దాల్చిందని తెలిసిన కొద్ది రోజుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది..అయితే నిందితుడికి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదని చెప్పింది.

    దీంతో ఇన్‌స్పెక్టర్ సైని ఫేస్‌బుక్‌లో పలు రకాల ఫోటోలతో కూడిన సుమారు వంద వరకు ప్రొఫైల్స్ తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి చూపించింది. దీంతో అందులో ఉన్న ఓ ప్రోఫైల్ ను గుర్తుపట్టిన యువతి ఆ నిందితుడి ఫ్రొఫైల్‌ను గుర్తుపట్టింది.

    ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా యువతులను మోసం చేస్తున్న వాడికి, దాని ద్వారానే బుద్ది చెప్పాలని భావించింది. వాడు నిజంగా మోసం చేస్తున్నాడా లేదా అనే అంశాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టేందుకు వాడి రూటులోనే ఇన్‌స్పెక్టర్ వెళ్లింది.. తాను కూడా ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియోట్ చేసి.. నిందితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. సాధారణంగా అమ్మాయిల వేటలో ఉన్న గురుడు.. వెంటనే సైని పెట్టిన రిక్వెస్ట్‌ను ఆక్సెప్ట్ చేశాడు.

    ఇక అప్పటినుండి కొద్ది రోజుల పాటు వాడితో ఇన్‌స్పెక్టర్ సైని చాటింగ్‌ సైతం చేసింది..ఇలా చాటింగ్ తర్వాత నిందితుడి ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వమని అడిగితే నిరాకరించాడు. కాని కలిస్తే అన్ని వివరాలు చెబుతానని అన్నాడు. కాని వాడిని నమ్మించే విధంగా వ్యవహరించిన ఇన్సెపెక్టర్ మెల్లగా వాడి వద్ద నుండి మొబైల్ నంబర్‌ను సంపాదించింది.

    ఇక ఆ తర్వాత జులై 31న సైనిని కలుస్తానని చెప్పాడు. అందుకోసం సాయంత్రం ఏడున్నర గంటలకు స్థానిక దశరథపురం రైల్వే స్టేషన్‌కు రమ్మన్నాడు. అయితే సివిల్ డ్రెస్‌లో అప్పటికే పోలీసులను పెట్టింది సైని. కాని నిందితుడు తెలివిగా ప్రవర్తించాడు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం నిమిషాల వ్వవధిలోనే మరో చోట అపార్ట్‌మెంట్‌లో కలుద్దామని చెప్పాడు. దీంతో తన బృందం వెళ్లిన సబ్‌ఇన్‌స్పెక్టర్ సైని నిందితుడిని నిందితుడు చెప్పిన అపార్ట్‌మెంట్ వద్ద అరెస్ట్ చేసింది..

    కాగా పోలీసుల విచారణలో అనేక విషయాలను బయటపెట్టాడు నిందితుడు.. ఇప్పటికే ఇలా పదిమంది యువతులకు వరకు మోసం చేశానని ఒప్పుకున్నాడు. అందుకే తన అడ్రస్ దొరకకుండా తరచూ ఇళ్లు మారుస్తాడని చెప్పాడు. అమ్మాయిలతో శారీరక వాంచ తీరిన తర్వాత వదిలేస్తానని అంగీకరించాడు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Delhi, Facebook

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు