Home /News /crime /

POLICE VIDEO OF A WOMAN BEING RESCUED IN HARYANA GOES VIRAL SNR

Video Viral: విషం తాగిన మహిళ కోసం ఆ పోలీస్ ఏం చేశాడో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Video Viral:హర్యానాలో ఓ పోలీస్ అధికారి చావుబతుకుల మధ్య ఉన్న మహిళను కాపాడాడు. మహిళపై విష ప్రయోగం జరిగిందని ఆమె 11ఏళ్ల కొడుకు డయల్ 112కి సమాచారం చేరవేయడంతో పోలీసులు దగ్గరుండి ఆమె ప్రాణాలు కాపాడారు. పోలీసులు మహిళను కాపాడేందుకు పడ్డ శ్రమకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
ఒంటి మీద ఖాకీ దుస్తులు వేసుకున్న వాళ్లంతా కఠినంగా ఉంటారనుకోవడం పొరపాటే. కొందరిలో కనికరం ఉంటుంది. మరికొందరు కర్తవ్య బాధ్యతతో వ్యవహరిస్తారని హర్యానా (Haryana)లో ఓ పోలీస్ నిరూపించాడు. ఫతేహబాద్‌ (Fatehabad) లోని దరియాపూర్‌ (Dariapur)గ్రామ శివార్లలో ఓ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె పక్కనే ఓ 11సంవత్సరాల (11years old) బాలుడు ఉన్నాడు. తల్లి ప్రాణాలు కాపాడలేని నిస్సహాస్థితిలో ఉన్న ఆ బాలుడు వెంటనే డయల్‌ 112కి ఫోన్ చేసి తన తల్లి చావు, బ్రతుకుల మధ్య ఉందని..విషం ఎవరో విషం(Poison)తాగించారని తనకు వచ్చి, రాని మాటలతో పోలీసులకు సమాచారం చేరవేశాడు. అంతే పిల్లాడి కంప్లైంట్‌(Compliant‌)ని డయల్ 112(Dial) ద్వారా రిసీవ్ చేసుకున్న పోలీస్ అధికారి మఖన్‌సింగ్ (Makhansingh) వెంటనే తన పోలీస్ బృందంతో వెహికల్‌ తీసుకొని స్పాట్‌కి చేరుకున్నాడు. అప్పటికే మహిళ నోట్లోంచి నురగలు కక్కుతూ ఆర్తనాధాలు పెట్టడం చూసి చలించపోయాడు. వెంటనే మఖన్‌సింగ్ తన రెండు చేతులపై ఆ మహిళను ఎత్తుకొని పోలీస్ వాహనం దగ్గరకు మోసుకెళ్లాడు. ఓ పోలీస్ అధికారి మహిళ ప్రాణాలు కాపాడేందుతు ప్రయత్నిస్తుండగా అక్కడున్న పోలీసులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. ఆపద సమయంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చెప్పడానికి ఈ వీడియో (Video)ని సోషల్ మీడియా(Social media) లో పోస్ట్ చేయడంతో వైరల్ (Viral) అయింది.

ఖాకీ కనికరం..
హర్యానా 112పోలీస్ అధికారి మఖన్‌సింగ్‌ హుటాహుటిన మహిళను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి పేరు సోమదేవిగా గుర్తించారు. అయితే మహిళే విషం తాగిందా లేక ఎవరైనా విషం తాగించారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలుడు ఇచ్చిన సమాచారం ప్రకారం సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం కారణంగా మహిళకు ప్రాణపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. బాలుడు ఇచ్చిన వివరాలను బట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు.

సూపర్‌ పోలీస్..
బాధిత మహిళ దగ్గర వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళపై విష ప్రయోగం జరిగిందా లేక ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు బిడ్డను తీసుకొని గ్రామ శివార్లకు వచ్చిందా అనే విషయాన్ని రాబట్టి తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 11ఏళ్ల బిడ్డ చేయబట్టి తల్లి ప్రాణం నిలబడింది. అయితే ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ అధికారి చూపించిన చొరవపై నెటిజన్లు అభినందిస్తున్నారు. పోలీసులు అంటే ఈవిధంగా స్పందించాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Haryana police, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు