POLICE VIDEO OF A MAN BEING BEATEN ON A ROAD IN MADHYA PRADESH HAS GONE VIRAL SNR
Video Viral: ఎంపీలో పోలీసుల ఓవర్ యాక్షన్..వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు ఇవిగో
Photo Credit:Youtube
Video Viral:మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ వ్యక్తిని చితకబాదారు. నడిరోడ్డుపై పట్టుకొని లాఠీలతో ఒళ్లు హూనం చేశారు. ఎందుకు కొట్టారో..ఏం నేరం చేశాడని అంత దారుణంగా చావబాదారో తెలియదు. కాని పోలీసులు కొడుతున్నప్పుడు తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దేశంలో ఏదో ఓ చోట పోలీస్ (Police)వ్యవస్థపై విమర్శలు వస్తున్నప్పటికి కొందరు పోలీస్ సిబ్బంది, అధికారుల్లో ఎలాంటి మాత్రం మార్పు రావడం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే నేరం చేసిన వాళ్లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను, చిన్న, చిన్ననేరాలకు పాల్పడిన వాళ్లను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో కూడా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. పోలీసులు ఓ వ్యక్తిని కొట్టిన beatenతీరు, అతని పట్ల వ్యవహరించిన విధానంపై అంతా వీడియో(video) రూపంలో సోషల్ మీడియా(social media)లో తెగ వైరల్ అవుతోంది. సిద్ది (sddi)పోలీసులు ఓ సాధారణ వ్యక్తి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. వీడియో చూస్తున్న నెటిజన్లు(Netizens)పోలీసులే గూండాయిజం చేస్తున్నారా ఏంటీ అని కామెంట్స్ షేర్ చేస్తున్నారు. వీడియోను బట్టి చూస్తే పోలీస్ వెహికల్ రోడ్డుపై ఉంది. ఇద్దరు పోలీసులు ఓ వ్యక్తితో మాట్లాడారు. అతనితో మాట్లాడిన కొద్ది సేపటికే జీప్ దగ్గరకు తీసుకెళ్లారు. జీప్‌లో ఉన్న అమీలియా (Amelia)పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్(Police Station in charge)అభిషేక్ సింగ్ (Abhishek Singh)సదరు వ్యక్తి పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించాడు. దానికి బాధితుడు కాస్త గట్టిగా సమాధానం చెప్పడంతో పోలీస్ అధికారికి చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతడ్ని చేతిలో కర్రతో విచక్షారహితంగా కొట్టాడు. నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ అతని కర్రతో ఒళ్లు హూనం చేశారు. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు (Constables)పట్టుకుంటే..పోలీస్ అధికారి కొట్టడం చూసి జనం ఆశ్చర్యపోయారు. కొడుతోంది పోలీసులు కావడంతో అడ్డుచెప్పలేకపోయారు. పోలీసులు వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే మధ్యప్రదేశ్‌లో ఇన్సిడెంట్ జరిగితే..ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
పోలీస్ దర్బార్..
ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చాడన్న చిన్న అంశాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులు ఓ సాధారణ వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ సిద్ది పోలీసుల నిర్వాకం బాహ్యప్రపంచానికి తెలియడంతో ఉన్నతాధికారులు అమీలియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ సింగ్‌పై పోలీసు సూపరింటెండెంట్ శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. నేరస్తుల్ని పట్టుకునే విషయంలో త్వరగా స్పందించని పోలీసులు ఓ వ్యక్తిని ఇంత దారుణంగా కొట్టడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రెచ్చిపోయి కొట్టారు రచ్చకెక్కారు..
తప్పు చేసిన వాళ్లను పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని రాజ్యంగంలో పొందపర్చబడి ఉంది. కాని పోలీసులు చట్టాలను పక్కన పెట్టి శిక్షలు కూడా తామే వేస్తున్న తీరుపై సామాజికవేత్తలు, మానవతవాదులు తప్పుపడుతున్నారు. శాంతిభద్రతల్ని పరిరక్షించి..ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికే పోలీస్ వ్యవస్థ ఉందని..ఇలా ఇష్టారాజ్యం వ్యవహరించడానిక కాదంటూ మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ పోలీసుల తీరును సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.