POLICE TRACK TWO 2 JUVENILES FOR OVER 1200 KM IN 58 HOUR LONG CHASE PVN
విమానం,ట్రైన్, కారులో..58 గంటలు..1200 కి.మీ పోలీస్ ఛేజింగ్..ఇంతకీ నేరస్తులు చేసిన తప్పు ఏంటంటే
ప్రతీకాత్మక చిత్రం
Cab Driver Stabbed Case: డబ్బుల కోసం క్యాబ్ డ్రైవర్ ను 32సార్లు కత్తితో పొడిచిన ఇద్దరు మైనర్లని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,100 నగదు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన 58 గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు.
Cab Driver Stabbed Case: డబ్బుల కోసం క్యాబ్ డ్రైవర్ ను 32సార్లు కత్తితో పొడిచిన ఇద్దరు మైనర్లని బెంగళూరు(Bengaluru) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,100 నగదు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన 58 గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. అయితే నిందితులను అరెస్ట్ చేసే క్రమంలో..పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. సినిమా స్టైల్ లో ఛేజింగ్ చేసి మరీ నిందితులను పట్టుకున్నారు పోలీసులు.
బీహార్(Bihar) కు చెందిన 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు పదో తరగతిలోనే చదవు ఆపేశారు. దొంగతనాలు చేయడానికి బెంగళూరు వచ్చారు. గత ఆదివారం రాత్రి బొమ్మనహల్లికి చేరుకున్న నిందితులు దిలీప్ అనే క్యాబ్ డ్రైవర్ను ఆశ్రయించారు. అయిలోతే కారు ప్రయాణించాలంటే.. రైడ్ యాప్ లో బుక్ చేయాలని దిలీప్ చెప్పగా తాము అత్యవసర పరిస్థితిలో ఉన్నామని,తమ వద్ద డబ్బులు ఏవీ లేవని,తాము వెళ్లాల్సిన చోటున డ్రాప్ చేయాలని బ్రతిమలాడారు. సరేలే పాపం అని వారిని కారు ఎక్కించుకున్నాడు దిలీప్. వాళ్లను పాపమనడమే దిలీప్ చేసిన తప్పు. కారు ఎక్కి ఎక్కిన ఇద్దరు యువకులు..కొద్ది సేపు కారులో ప్రయాణించిన తర్వాత కోరమంగళలోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ దగ్గరకి వచ్చాక దిలీప్ ను బెదిరించి 32 సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అతని వద్ద నుంచి రూ.12,000 డబ్బు దోచుకుని పారిపోయారు. అయితే హాస్పిటల్ సమీపంలోనే ఉండటంతో బాధితుడు దిలీప్ కు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే క్రైమ్ సీన్ లో నేరస్థులు.. తమ వ్యక్తిగత వివరాలతో కూడిన బ్యాంక్ పే స్లిప్ ను మర్చిపోయారు. దీంతో బ్యాంకు సాయంతో నిందితుల చిరునామా, మొబైల్ నంబర్లను పోలీసులు రాబట్టారు. కాల్ రికార్డ్ వివరాల ద్వారా వాళ్లు ఇంకా అదే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ నాగరాజ్ ఎస్. షెట్టర్ నేతృత్వంలోని బృందం వారిద్దరిని ట్రాక్ చేయడం ప్రారంభించింది. అయితే దిలీప్ పై దాడి చేసిన తర్వాత కొంతసమయానికి నిందితులు ఇద్దరూ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి.. బికనీర్ వెళ్లే ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసు బృందం కనిపెట్టింది. దీంతో పూణే స్టేషన్ లో రైలు ఎక్కాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. షెట్టర్ మరియు అతని బృందం పూణేకు విమానంలో బయలుదేరారు. షెట్టర్ బృందం రైలు ఎక్కడానికి సమయానికి పూణేలో దిగింది, కానీ ప్రయాణికుల రద్దీ కారణంగా నిందితుడిని గుర్తించలేకపోయారు.
అయితే కాల్ రికార్డ్ వివరాల ద్వారా నిందితులు గుజరాత్ లో రైలు నుండి దిగినట్లు పోలీసులకు తెలిసింది. నిందితులు దహేజ్ పట్టణంలో తమ స్వగ్రామానికి చెందిన కూలీలతో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో కాల్ రికార్డ్ వివరాల ఆధారంగా పూణే నుంచి కారులో దహేజ్ కి బయల్దేరిన పోలీసులు అక్కడి లేబర్ కాలనీకి చేరుకుని కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని స్థానికులను ఆరా తీశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, రక్తపు మరకలు, 2,100 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విమానంలో, ట్రైన్లో, కారులో ఇలా 58 గంటలు.. 1200 కిలోమీటర్ల ఛేజింగ్ చేసినేరస్థులను పోలీసులు పట్టుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.