ప్రైవేట్ బాడీ పార్ట్స్ తడుముతూ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పోలీసులు..

‘పోలీసులు లాకప్‌లో మమ్నల్ని నగ్నంగా నిలబెట్టారు. లైంగికంగా వేధించారు. మా అంగాలను తడిమారు.’ అంటూ పోలీసుల మీద ముగ్గురు అక్కాచెల్లెళ్లు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: September 20, 2019, 9:20 PM IST
ప్రైవేట్ బాడీ పార్ట్స్ తడుముతూ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ కేసులో విచారణ కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు వారితో అమానవీయంగా ప్రవర్తించారు. అసోంలో ఈ దారుణం జరిగింది. అసోంలోని దరాంగ్ జిల్లాలో ఓ యువతిని ఓ యువకుడు మోసం చేశాడు.దీంతో బాధితురాలు తన ప్రియుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం వెళితే అతడు కనిపించలేదు. ఇంటి వద్ద ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను (వారి వయసు వరుసగా 30, 28, 18 సంవత్సరాలు) తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సోదరుడి ఎక్కడున్నాడో చెప్పాలంటూ వారిని ప్రశ్నించారు. వారు తమకు తెలియదని చెప్పడంతో ఏకంగా వారి దుస్తులు విప్పించారు. కర్రలతో కొట్టారు. వారి అంగాంగాలను తడిమారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. విషయం తెలిసిన తర్వాత ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను తప్పు చేస్తే.. చెల్లెళ్లను ఎందుకు హింసిస్తున్నాడని ప్రశ్నించారు. దీంతో పోలీసులు అతడిని కూడా చావబాదారు.

‘పోలీసులు లాకప్‌లో మమ్నల్ని నగ్నంగా నిలబెట్టారు. లైంగికంగా వేధించారు. మా అంగాలను తడిమారు.’ అంటూ పోలీసుల మీద ముగ్గురు అక్కాచెల్లెళ్లు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading