మహిళను బెల్టుతో చితకబాదిన పోలీసులు.. దండం పెడతానని బతిమిలాడినా..

Crime News: గత అక్టోబరులో చోటుచేసుకున్న ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి మహిళా కమిషన్‌కు పంపడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన హరియానా మహిళా కమిషన్ పోలీసు ఉన్నతాధికారులకు వీడియోను పంపి ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: May 28, 2019, 1:57 PM IST
మహిళను బెల్టుతో చితకబాదిన పోలీసులు.. దండం పెడతానని బతిమిలాడినా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాళ్లంతా పోలీసులు.. కష్టం వస్తే అండగా నిలవాల్సింది పోయి వారే తప్పు చేస్తే.. పైగా, రాత్రి పూట ఒక మహిళను మధ్యలో నిలబెట్టి చుట్టూ తిరుగుతూ ఆమెపై దాడి చేస్తే.. బెల్టుతో ఆమెను చితకబాదితే.. ఎంత దారుణం? గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఓ మహిళపై దారుణంగా ప్రవర్తించారు హరియాణాలోని ఫరీదాబాద్ పోలీసులు. ఓ గ్రౌండ్‌లో మహిళను నిల్చోబెట్టి చుట్టూ ఐదుగురు పోలీసులు తిరుగుతూ ఆమెను దుర్భాషలాడారు. ఓ పోలీసు అయితే ఏకంగా బెల్టు తీసి ఆమె వెనుక భాగంపై దారుణంగా కొట్టాడు. చేయి కూడా చేసుకున్నాడు. గత అక్టోబరులో చోటుచేసుకున్న ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి మహిళా కమిషన్‌కు పంపడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన కమిషన్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, వీడియోను పంపించింది.

దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడమే కాకుండా మరో ముగ్గురు స్పెషల్ పోలీస్ అధికారులను సర్వీసు నుంచి టర్మినేట్ చేశారు. వారిలో ఇద్దర్ని అరెస్టు చేశారు. మిగతా వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, బాధితురాలిని వెతికే పనిలో నిమగ్నమైన పోలీసులు.. ఆమెతో లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకుని, తదుపరి దర్యాప్తు చేసేందుకు రెడీ అయ్యారు.
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading