కుమార్తె మృతదేహం వద్ద తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై చర్యలు...

పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నాడు.

news18-telugu
Updated: February 26, 2020, 8:49 PM IST
కుమార్తె మృతదేహం వద్ద తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై చర్యలు...
విద్యార్థి తండ్రిని బూటుకాళ్లతో తంతున్న పోలీసు
  • Share this:
ఆత్మహత్య చేసుకున్న కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లిపోతున్న తండ్రిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్ మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్‌‌ను సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈ మేరకు ఎస్పీ చందన దీప్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ 25-2-2020 నాడు వెలిమల గ్రామం పటాన్‌చెరు మండలం పరిధిలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి కాలేజీ ఆవరణలో ఆత్మహత్య చేసుకోగా మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భానూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి పటాన్చెరు కు తరలించారు. 26-2-2020 నాడు ఉదయం మృతురాలి బంధువులు మృతదేహాన్ని మార్చురీ నుంచి కాలేజీ ఆవరణకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఈ క్రమంలో పోలీసు వారు మృతదేహాన్ని తిరిగి మార్చురీకి తీసుకెళ్లే క్రమంలో పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ (పీసీ 349) మృతురాలి తండ్రితో దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ సంఘటనలో కానిస్టేబుల్ను హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డికి అటాచ్ చేస్తూ సంఘటనపై, వైరల్ అయిన వీడియోలను పూర్తిగా విశ్లేషించి పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని ప్రకటన విడుదల చేశారు.

నిన్న నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు.. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నాడు. దీంతో ఇప్పుడు పోలీసుల తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి.

వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ (MPC) ఫస్ట్ ఇయర్ చదువుతుంది.  మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్ రూంలోకి వెళ్లిన సంధ్య అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న BDL - భానూర్ పోలీసులు. సంధ్యారాణిది మహబూబ్ నగర్ జిల్లా .. జడ్చర్ల మండలం.. మల్లెబోయినపల్లి. కూతురు మరణంతో తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు.. యాజమన్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు