షాద్‌నగర్ డాక్టర్ హత్య లారీ డ్రైవర్ల పనేనా ?

ప్రియాంక రెడ్డి అనుమానించినట్టుగా లారీ డ్రైవర్లే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి... అనంతరం హత్య చేశారా ? అనే కోణంలోనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 30, 2019, 4:14 PM IST
షాద్‌నగర్ డాక్టర్ హత్య లారీ డ్రైవర్ల పనేనా ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షాద్‌నగర్‌ సమీపంలో సజీవ దహనానికి గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కలకలం రేపుతోంది. ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక... తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ పాడైందని... చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్‌లో వివరించింది. తాను మళ్లీ ఫోన్ చేస్తానని తెలిపింది. రాత్రంతా ప్రియాంక ఇంటికి రాకపోవడంతో... ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్ నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని గుర్తించిన పోలీసులు... మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు... ఆ డెడ్ బాడీ ప్రియాంక రెడ్డిదే అని గుర్తించారు.

అయితే ప్రియాంక రెడ్డిని ఎవరు హత్య చేశారనే అంశంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ప్రియాంక రెడ్డి అనుమానించినట్టుగా లారీ డ్రైవర్లే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి... అనంతరం హత్య చేశారా ? అనే కోణంలోనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే... సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాల్సి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక తన చెల్లెలికి చివరిసారీగా ఫోన్ చేసిన సమయంలో ఎక్కడ ఉన్నట్టు చెప్పిందనే విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు... అక్కడ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఆమె ఫోన్ నుంచి చివరిసారి ఎవరికి ఫోన్ చేసిందనే విషయం తెలిస్తే... ప్రియాంక హత్య కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>