జషిత్ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు..? వారి పనేనా..?

జషిత్ తండ్రికి ప్రతీ ఆదివారం క్రికెట్ ఆడే అలవాటు ఉండటం.. చుట్టుపక్కల ప్రాంతాలైన మండపేట,అనపర్తి ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారడంతో.. బెట్టింగ్ ముఠాల పైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

news18-telugu
Updated: July 26, 2019, 11:31 AM IST
జషిత్ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు..? వారి పనేనా..?
చిన్నారి జషిత్
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌కు గురై.. ఆపై క్షేమంగా ఇంటికి చేరిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. కేసులో చిక్కుముడి మాత్రం ఇంకా వీడలేదు. జషిత్‌ కుటుంబానికి పరిచయం ఉన్నవారే కిడ్నాప్ చేశారా? లేక బయటి వ్యక్తుల పనేనా? అన్నది తేలాల్సి ఉంది. జషిత్ తండ్రికి ప్రతీ ఆదివారం క్రికెట్ ఆడే అలవాటు ఉండటం.. చుట్టుపక్కల ప్రాంతాలైన మండపేట,అనపర్తి ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారడంతో.. బెట్టింగ్ ముఠాల పైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

జిల్లాలో బెట్టింగ్ స్థావరాలుగా పేరుగాంచిన ఈ రెండు ప్రాంతాలకు ప్రతీ ఆదివారం పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు చేరుకుంటాయి.ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా బెట్టింగ్ డబ్బులు ఎగ్గొడితే.. ఇక వారికి మూడినట్టే. ముక్కు పిండి మరీ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో జషిత్ తండ్రికి బెట్టింగ్ ముఠాతో ఏమైనా గొడవలున్నాయా?.. అన్న కోణంలో పోలీసులు ఫోకస్ చేశారు. బెట్టింగ్ ముఠాల పైనే ఎక్కువగా ఆరోపణలు వస్తుండటంతో.. ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
Published by: Srinivas Mittapalli
First published: July 26, 2019, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading