Home /News /crime /

POLICE SURVEILLANCE ON CYBER CRIMINALS MAKING NUDE VIDEO CALLS AND BLACKMAILING IN ADILABAD DISTRICT SNR ADB

Cyber ​​fraud : న్యాయవాదికి న్యూడ్ కాల్ చేసిన అమ్మాయిలు .. తర్వాత వీడియో చూసి షాక్

(Cyber ​​fraud)

(Cyber ​​fraud)

Cyber ​​fraud: యువతే లక్ష్యంగా ఆన్ లైన్ ద్వారా మోసానికి పాల్పడుతున్న ఘటనలు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఈ జాబితాలో అమాయకులతో పాటు విద్యావంతులు, లాయర్లు సైతం బుక్కైపోతున్నారు. డబ్బుల కోసం ఫోన్‌కాల్స్‌ ద్వారా పరిచయాలు పెంచుకొని అటుపై బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India
    (K.Lenin,News18,Adilabad)
    సైబర్‌ మోసాల(Cyber ​​fraud)బారిన పడుతున్న జాబితాలో అమాయకులతో పాటు విద్యావంతులు, వక్తలు, ఉద్యోగులు, చివరకు న్యాయపోరాటం చేసే లాయర్లు సైతం బుక్కైపోతున్నారు. డబ్బుల కోసం ఫోన్‌కాల్స్‌(Phone calls)ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని ..ఆ తర్వాత వాట్సాప్‌ కాల్స్(WhatsApp calls), తర్వాత వీడియో చాటింగ్(Video chatting)పేరుతో బ్లాక్‌మెయిల్(Blackmail)చేస్తున్న ఘటన ఆదిలాబాద్‌(Adilabad)జిల్లాలో సంచలనంగా మారింది. కొత్త నెంబర్ నుంచి అపరిచితురాలు ఫోన్‌ చేయడంతో ఓ న్యాయవాది చిక్కుల్లో పడ్డారు. తనకు జరిగిన మోసాన్ని ఆయనే బయటపెట్టడంతో పోలీసులు(Police)అలర్ట్ అయి ప్రజలకు ఫోన్‌కాల్స్‌ పట్ల తగిన సూచనలు చేస్తున్నారు.

    Jaggareddy | Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన అదే .. నవంబర్‌ 5న ముహుర్తం ఫిక్స్



    కొత్త తరహా మోసం..
    ఇందులేరు..అందులేరు. ఎందెందు వెదికినా అన్నింట కలరు అన్నట్లుగా మారిపోయింది సైబర్ మోసగాళ్ల తీరు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్న జనానికి సైబర్ నేరగాళ్లు కనిపించకుండా షాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ యాప్స్, ఆన్‌లైన్‌ షాపింగ్, మ్యాట్రిమోనీల పేరుతో అమాయకులను దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూట్‌ ఎంచుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో న్యాయవాది వృత్తిలో ఉన్న ఓ వ్యక్తికి ఈ చేదుఅనుభవం ఎదురవడంతో షాక్ అయ్యాడు.



    సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు..
    బాధితుడికి కొత్త ఫోన్‌ నెంబర్‌ నుంచి మిస్డ్ కాల్ రావడంతో రిప్లై ఇచ్చాడు. అప్పుడు కాంటాక్ట్ సేవ్ చేసుకున్న లేడీ సైబర్‌ చీటర్స్ వాట్సాప్‌ ద్వారా పరిచయం పెంచుకొని ...మెసేజ్‌లు, చాటింగ్‌ చేస్తూ వచ్చారు. అదే క్రమంలో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో సదరు లాయర్ అవక్కయ్యాడు. వెంటనే అవతలి వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్ రావడం ...తనకు అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఈ వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారని బాధిత లాయర్ తెలిపారు.

    న్యూడ్ కాల్స్‌తో బ్లాక్‌మెయిల్..
    అంతే కాదు సదరు యువతి తాను అడిగినంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే ఈ నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మీ బంధువులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగడంతో న్యాయవాదిగా ఉన్న వ్యక్తే షాక్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తే ఈ తరహా సైబర్ మోసాలకు ఎక్కువ మంది యువతి, యువకులు బలయ్యే ఛాన్సుందని భావించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. లాయర్‌కు వచ్చిన ఫోన్‌ నెంబర్‌ని నోట్ చేసుకున్న పోలీసులు వివరాలు రాబడుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతే లక్ష్యంగా ఆన్ లైన్ ద్వారా మోసానికి పాల్పడుతున్న ఘటనలు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.

    No Helmet-No Petrol Rule: తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. హెల్మెట్ లేని వారికి బంకుల్లో నో పెట్రోల్.. ఆగస్టు 15 నుంచి అక్కడ కొత్త రూల్



    లాయర్లను వదలని యువతులు..
    ఆదిలాబాద్‌ జిల్లాలో న్యాయవాదితో పాటు ఇలాంటి ఫేక్ కాల్స్‌తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న వాళ్లు ఇప్పటికే చాలా మందికి ఫోన్‌ కాల్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నష్టపోయిన వాళ్లు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే పరువు పోతుందని జంకుతున్నారట. అందుకే పోలీసులు మాత్రం గుర్తు తెలియని నెంబర్ ద్వారా ఫోన్‌లు వస్తే ఎవరూ లిఫ్ట్ చేయవద్దని..వాట్సప్‌లో చాటింగ్ చేయవద్దని సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, CYBER CRIME, Telangana News

    తదుపరి వార్తలు