ఎన్‌కౌంటర్ తర్వాత.. ఆ పోలీసుల పరిస్థితి ఘోరం..

ఎన్‌కౌంటర్ ఏదైనా సరే.. చేసేది పోలీసులే. చేసేవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే మొదలవుతుంది వారికి టార్చర్. మానవ హక్కలు సంఘాల నేతల కేసులు, కోర్టుల్లో విచారణ.. ఇలా వారికి నరకమే.

news18-telugu
Updated: December 8, 2019, 3:17 PM IST
ఎన్‌కౌంటర్ తర్వాత.. ఆ పోలీసుల పరిస్థితి ఘోరం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్‌కౌంటర్ ఏదైనా సరే.. చేసేది పోలీసులే. చేసేవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే మొదలవుతుంది వారికి టార్చర్. మానవ హక్కలు సంఘాల నేతల కేసులు, కోర్టుల్లో విచారణ.. ఇలా వారికి నరకమే. కేసు తెగే వరకు వాళ్లు తిరుగుతూనే ఉండాలి. తాజాగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పరిస్థితిపై వార్తలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఏదైనా క్రైం జరిగిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని, నడిరోడ్డుపై కాల్చి చంపాలని భావోద్వేగంతో మాట్లాడుతారు. అయితే, ఏదైనా సందర్భంలో ఎన్‌కౌంటర్లు జరిగితే.. ప్రజలే మానవ హక్కులు అంటూ కేసులు వేస్తారు. దీంతో పోలీసులు ఆ కేసులపై కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ కేసు వేస్తే అక్కడి వరకు వెళ్లాల్సిందే. ఈ సందర్భంలో పోలీసులకు మద్దతు లభించదు.

అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ పోలీసులకు విపరీతమైన మద్దతు లభిస్తుంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత పోలీసులపై కేసులేసిన ఇప్పటికే వారిని దుమ్ము దులుపుతున్నారు. దిశకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వారంతా కళ్ళు తెరవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>