
ప్రతీకాత్మకచిత్రం
మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు, తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైటర్ అదృశ్యమయ్యారు.
పోలీస్ స్టేషన్లో స్టేషన్ రైటర్ గా విధులు నిర్వహిస్తున్న శివ శంకర్ అనే ఉద్యోగి ఓ మహిళతో పాటు నలుగురు పిల్లలను తీసుకొని అదృశ్యం అయ్యాడు. దీంతో మహిళ భర్త రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న శివ శంకర్ కొందుర్గ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ రైటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి కనబడడం లేదని శివ శంకర్ భార్య పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అంతలోపే ఓ మహిళ మిస్సింగ్ అయినట్టు ఆ మహిళ భర్త షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన ఇద్దరి పిల్లలతో పాటు తన భార్యను కూడా శివ శంకర్ తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతలోపే తమ పిల్లలు కూడా లేరని శివ శంకర్ భార్య పోలీసుల దృష్టికి తీసుకు వచ్చింది. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:September 05, 2020, 18:10 IST