నల్లమలలో మహిళపై అత్యాచారం, హత్య... మిస్టరీని ఛేదించిన పోలీసులు...

Nallamala Woman Murder Case : నేరస్థులు తెలివైన వారు. చేసిన నేరం ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో... ఉన్న సాక్ష్యాధారాల్ని నాశనం చేస్తారు. ఆ దుర్మార్గుడు కూడా అలాగే చేశాడు. మరి ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు?


Updated: February 7, 2020, 3:13 PM IST
నల్లమలలో మహిళపై అత్యాచారం, హత్య... మిస్టరీని ఛేదించిన పోలీసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Nallamala Woman Murder Case : నాగర్‌కర్నూల్... నల్లమల అడవుల్లో... అక్క మహాదేవి ఆలయం మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్-శ్రీశైలం హైవే రూట్‌లో... వటవర్లపల్లి నుంచీ అక్క మహాదేవి ఆలయానికి వెళ్లేందుకు కాలినడక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తూ భక్తులు ఓ చోట ఆగిపోయారు. ఎందుకంటే అక్కడ వారికి ఓ మహిళ మృతదేహం కనిపించింది. అది చూడగానే షాకయ్యారు. అమ్మో అనుకుంటూ... పోలీసులకు ఫోన్ చేశారు. అలర్టైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. శవం దగ్గర ఓ బ్యాగ్ ఉంది. దాన్ని చెక్ చేస్తే... అందులో ఆధార్ కార్డు దొరికింది. దాని ప్రకారం ఆమె పేరు శాంతా రఘువిదియార్ అని తెలిసింది. ఆమె వయసు 50 ఏళ్లు అనీ, ముంబైకి చెందిన వివాహిత అని అర్థమైంది. అసలు ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. క్షుద్రపూజలు చేసి హతమార్చారా? అన్న అనుమానాల కలిగాయి. పోలీసులు శవం పడివున్న తీరు చూసి... ఆమెపై అత్యాచారం చేసి... గొంతు కోసి చంపి ఉంటారని భావించారు. వాళ్ల అనుమానమే నిజమైంది. వాస్తవంగా అదే జరిగింది.

పోలీసులు తలచుకుంటే ఏ కేసునైనా ఛేదించగలరు. నేరస్థులు ఎన్ని సాక్ష్యాధారాల్ని నాశనం చేసినా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక తీగ పోలీసులకు దొరుకుతుంది. టెక్నాలజీ బాగా ఉన్న ఈ రోజుల్లో నేరగాళ్లు తప్పించుకోలేరు. ఈ కేసులోనూ అదే జరిగింది. సీసీ కెమెరాలు నేరస్థుణ్ని పట్టించాయి. ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత... తమిళనాడుకు చెందిన నిందితుడు, సాధువైన రామకృష్ణ అలియాస్ మట్కాస్వామి (62)ను పట్టుకున్నారు.అసలేం జరిగిందంటే... మట్కాస్వామి... శ్రీశైలం దర్శనానికి వచ్చిన మహారాష్ట్రకు చెందిన మహిళతో మంచివాడిలా మాట్లాడుతూ నాటకాలాడాడు. నల్లమలలో దర్శించుకోవాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి అన్నాడు. అవన్నీ తనకు తెలుసన్నాడు. తాను చూపిస్తానన్నాడు. అతని నిజస్వరూపం తెలియని ఆమె సరే అంది. అలా... శ్రీశైలం నుంచీ సున్నిపెంటకు కమాండర్ జీపులో ఆమెతో ప్రయాణించాడు. అక్కడి నుంచీ అక్క మహాదేవి గుహల మార్గంలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆమె దురదృష్టం కొద్దీ ఆ రోజు అటుగా వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రామకృష్ణను నమ్మి అతని వెంట బయలుదేరింది. మార్గ మధ్యలో ఎవరూ లేని టైమ్ చూసి... ఆమెపై క్రూరమృగంలా ఉరికాడు. ఆమె తప్పించుకోలేని పరిస్థితుల్లో రేప్ చేశాడు. ఆమె బతికి ఉంటే విషయం అందరికీ చెబుతుందని అనుకొని... నిమ్మకాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశాడు. తనను చంపవద్దని ఆమె ఎంతగానో వేడుకున్నా ఆ దుర్మార్గుడు వెనక్కి తగ్గలేదు.

ఆమె చనిపోయిందని డిసైడయ్యాక... ఆమె బ్యాగ్, సెల్‌ఫోన్‌ని పక్కనున్న పొదల్లోకి విసిరేశాడు. తన విషయం ఎవరికీ తెలియదులే అనుకొని పారిపోయాడు. ఐతే... రామకృష్ణకు తెలియని సీక్రెట్ ఏంటంటే... ఆ అడవుల్లో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో ఆమె రామకృష్ణ వెంట వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ కొండెగాడు ఎవడా అని ఆరా తీశారు. జీపు వాళ్లను అడగ్గా కొంత డేటా తెలిసింది. శ్రీశైలంలో చెక్ చెయ్యగా మరిన్ని వివరాలు తెలిశాయి. అలా అతన్ని పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టారు. ఇలాంటి కేటుగాళ్ల వల్లే... ఇతర రాష్ట్రాల నుంచీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్న భక్తులు... రావాలంటే భయపడుతున్నారు. ఈ ఘటనతో పోలీసులు ఇలాంటి అడవి మార్గాల్లో మరిన్ని అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని డిసైడయ్యారు.


Published by: Krishna Kumar N
First published: February 7, 2020, 6:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading