ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు

Delhi Sex Racket : వ్యభిచారం చట్టరీత్యా నేరం అని తెలిసికూడా చాలా మంది హైటెక్ లెవెల్లో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. స్పా పేరుతో జరుగుతున్న ఆ తంతుకి పోలీసులు చెక్ పెట్టారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 8:03 AM IST
ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 8:03 AM IST
ఢిల్లీలోని రోహిణీ ఏరియాలోని ఓ మాల్‌లో అదో చూడచక్కని స్పా. దాన్ని చూసినవాళ్లెవరికైనా లోపలికి వెళ్లి మసాజ్ చేయించుకోవాలనే అనిపిస్తుంది. దానిపై డౌట్ వచ్చిన ఓ జర్నలిస్ట్‌... మసాజ్ పేరుతో లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లి చూడగా... రకరకాల అమ్మాయిలు... అందాల విందు చేస్తూ రారమ్మని ఆహ్వానిస్తున్నారు. కవ్వించే చూపులతో కైపెక్కిస్తున్నారు. స్వర్గాన్ని చూపిస్తానని తనతో తీసుకెళ్లబోయింది ఓ మహిళ. తనకు పని ఉందంటూ... బయటికి వచ్చేసిన ఆ జర్నలిస్ట్... వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్‌కి కాల్ చేశాడు. జరుగుతున్న తంతును వివరించాడు. ఆ స్పాకి అంత సీన్ ఉందా అనుకుంటూ ముందుగా వాళ్లు పోలీసులకు కాల్ చేసి అడిగారు. తమకు ఎలాంటి కంప్లైంట్లూ ఇంతకు ముందు రాలేదని పోలీసులు చెప్పారు.

అటు పోలీసులు, ఇటు మహిళా కమిషన్ సభ్యులూ కలిసి ఆ స్పాపై రైడ్ చేశారు. వెతికిన కొద్దీ అమ్మాయిలు దొరుకుతూనే ఉన్నారు. ఇలా మొత్తం 11 మంది అమ్మాయిలను పట్టుకున్నారు. అందరూ మిలమిలా మెరిసిపోతూ ఎట్రాక్టివ్‌గా ఉండటమే కాదు... పోలీసుల్ని కూడా వస్తావా అని అడుగుతున్నారు వాళ్లు. కొంతమందైతే... సెన్సార్ దృశ్యాల్ని చూపిస్తూ... పండగ చేస్కో అంటుంటే... పోలీసులకు మరింత మండింది. అక్కడ అమ్మాయిలతో శృంగార కార్యకలాపాలు చేయిస్తూ... ఒక్కో పనికీ ఒక్కో రేటు ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

ఆ అమ్మాయిలను ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేశారు. అమ్మాయిలను బాధితురాళ్లుగా భావిస్తూ, ఎవరిపైనా కేసులు నమోదు చెయ్యలేదని పోలీసులు వివరించారు.

 ఇవి కూడా చదవండి :

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య

నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
Loading...
ఏపీలో సంకీర్ణమే... గ్రహాలు అలా ఉన్నాయి... పవన్ మద్దతు అవసరమే...

ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...