గుట్కా ప్యాకెట్లును స్వాధీనంచేసుకున్న పోలీసులు... వీటి విలువ ఎంతో తెలుసా...

సుమారు లక్షా 50 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

నందిగామ లోని నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు.

  • Share this:
    కృష్ణాజిల్లా: నందిగామ లోని నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి లక్షా యాభై వేల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనంచేసుకున్నారు.
    చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన కొత్తమాసు రాజు అనే వ్యక్తిని ఆపి అతని స్కూటీ తనిఖీ చేయగా సుమారు లక్షా 50 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఒక మూటలో కట్టి లభించాయి. ఇతను పలుమార్లు నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణా చేస్తూ పట్టుబడినట్లు సమాచారం. అతనితోపాటు కంచికచర్ల గ్రామానికి చెందిన దాసా శేఖర్ మరియు తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణా తో సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి మీడియాతో తెలిపారు.
    Published by:Venu Gopal
    First published: