Home /News /crime /

POLICE SEIZE GUTKA PACKETS WORTH RS 4 LAKH IN A SINGLE DAY IN TELANGANA ADILABAD DISTRICT SNR ADB

Adilabad: గుట్కా, గంజాయి అక్రమ దందాకు చెక్..ఒక్కరోజులో 4.5లక్షల సరుకు సీజ్

(GUTKA MAFIA)

(GUTKA MAFIA)

GUTKA MAFIA: ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వేర్వేరు చోట్ల సోదాలు చేసి 4.5లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేశారు.

ఇంకా చదవండి ...
(KATTA LENIN,ADILABAD,NEWS18)
తెలంగాణ(Telangana)లోని ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి(Marijuana), గుట్కా (Gutka)అక్రమ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ప్రాంతంలో మహమ్మద్ అక్రం అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా విలువ రెండు లక్షల రూపాయలు(2Lakhs) చేస్తుందని ఆదిలాబాద్ ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి(Uudaykumar reddy)తెలిపారు. జైనథ్ (Jainad)మండల కేంద్రంలోని నోముల విలాస్ రెడ్డి నివాసంలో తనిఖీ చేయగా ప్రమోద్ అనే వ్యక్తి గదిని అద్దెకు తీసుకొని నిల్వ ఉంచిన రెండు లక్షల రూపాయల నిషేధిత గుట్కా లభించింది. గుట్కాను స్వాధీనం చేసుకొని నిందితుడితోపాటు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. బేల (Bela)మండల కేంద్రంలోని ఆసిఫ్ కిరాణా షాప్ నందు తనిఖీ చేయగా నిందితుడు ఆసీఫ్ కు చెందిన 40 వేల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా లభించగా, పక్కనే ఉన్న సందీప్ అనే వ్యక్తికి చెందిన మరో కిరాణ దుకాణంలో పది వేల రూపాయల విలువ గల గుట్కా లభించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ బ్రాంచి పోలీసులు చేసిన దాడుల్లో ఒక్కరోజే నాలుగున్నర లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు, వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్‌లో ఈ భారీ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గుట్కా అక్రమంగా నిల్వ చేసిన చేసిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడిపై 2019వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు 17 కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు.
2021 జూన్‌ 15వ తేదిన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు.

గుట్కా అక్రమ దందాపై నిఘా..
పట్టుబడిన రెండు లక్షల రూపాయల విలువ గల నిషేధి గుట్కా వివరాలను జిల్లా ఎస్.పి. డి. ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పట్టణంలో గుట్కాను విక్రయించే ఇతర వ్యాపారులపై కూడా నిఘా ఉంచామని, వారు కూడా గుట్కా విక్రయాలను నిలిపి వేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా ప్రజలు సహకరించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా, మట్కా, గంజాయి సమూలంగా నిర్మూలించడమే పోలీసుల లక్ష్యమని చెప్పారు. గంజాయి , గుట్కా వాడకం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ప్రజలు మాదకద్రవ్యాల అలవాట్లను మానుకుని తమ జీవితాలను సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి నుండి గుట్కా నిర్మూలనకు మూకుమ్మడి దాడులు, కార్డెన్ సెర్చ్ లు, ఒకేసారి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి గుట్కాను నిర్మూలించడానికి కృషి చేస్తామని తెలిపారు.

పెద్ద మొత్తంలో గుట్కాప్యాకెట్లు స్వాధీనం..
ప్రజలు సైతం జిల్లాలో ఎటువంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియపర్చాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గుట్కా నిర్మూలన కోసం ప్రయత్నిస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఎస్పీ అభినందించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Adilabad, Ganja case, Ganja smuggling

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు