POLICE SEIZE 1 CRORE RUPEES VALUE GANJA SILERU IN VISAKHAPATNAM DISTRICT NGS VSP
Andhra Pradesh: పోలీసుల కన్ను కప్పేందుకు వేసిన ప్లాన్ రివర్స్. కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం
కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం
ఏపీలో అక్రమ గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యదేచ్ఛగా అక్రమ గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది గంజాయి గ్యాంగ్. తాజగా సీలేరు పోలీసుల తనిఖీలో కోటి రూపాయల విలువ చేసే గంజాయి పట్టుబడింది.
ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా..? పటిష్టమైన నిఘా పెడుతున్న గంజాయి సప్లై ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి గ్యాంగ్ ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరులో రూ.కోటి రుపాయలు విలువైన గంజాయిని సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్పర్ల నుంచి తెలంగాణా రాష్ట్రంకు వ్యానులో తరలిస్తున్న540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తరలింపుకు పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వెంటనే వారిని అరెస్ట్ చేశారు. ఏపీ జెన్కో చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్ 35 టీ 7192 బొలెరా పికప్ వ్యాన్ పై అనుమానం వచ్చింది. దీంతో ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, వ్యాన్ వెనుకబాగం లో ప్లాస్టిక్ బస్తాల లోడ్ ఉందని డ్రైవర్ చెప్పారు. కానీ వారి మాటలు అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే వెనుక ఓపెన్ చేయమని పోలీసులు గట్టిగా చెప్పడంతో వారికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
దీంతో పోలీసుల సమక్షంలో ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లని చెప్పిన బస్తులు తెరిచి చూసి అంతా షాక్ కు గురయ్యారు. అందులో భారీగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వ్యాన్‌లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆరాతీయగా, సప్పర్ల వద్ద పరిసర ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణా తరలిస్తున్నట్లు చెప్పారు.
వ్యాన్‌లో 17 బస్తాలు ఉండగా, వాటిని బరువు 540 కేజీలుగా గుర్తించారు. పట్టుబడ్డ వారు ఇద్దరూ తెలంగాణ వాసులే. వికారాబాద్ జిల్లా రాల్లగుడి గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్, సంగారెడ్డ జిల్లా మియాపూర్ తండాకు చెందిన గణపతినాయక్ లుగా గుర్తించారు. వారి దగ్గర దొరికిన గంజాయి విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.