Home /News /crime /

POLICE SAVES WOMAN FROM KIDNAPPER WITH THE HELP OF APPLE WATCH IN AMERICA SRD

Apple Watch : కిడ్నాపర్ చెర నుంచి మహిళను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apple Watch : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చిందన్నది నమ్మాల్సిన నిజం. టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపణ అయింది.

    టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చిందన్నది నమ్మాల్సిన నిజం. టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపణ అయింది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. యాపిల్ వాచ్ వల్ల మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి వృద్ధుడిని కాపాడినా..అంతకుముందు స్వీడన్‌లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన ఘటన వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తాజాగా యాపిల్ స్మార్ట్‌వాచ్‌ కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టెక్సాస్‌లోని సెల్మా ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆపదలో ఉన్నానని సహాయం చేయాలని కోరుతూ తన కూతురికి యాపిల్ స్మార్ట్‌వాచ్‌ ద్వారా సమాచారాన్ని అందించింది. ఆమె ఉన్న ప్రదేశం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేలోపే వాచ్‌ నుంచి వచ్చిన కాల్ కట్ అయింది.

    దీంతో ఆమె కూతురు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారు ఎమర్జెన్సీ సెల్యూలార్‌ పింగ్ సాయంతో కిడ్నాప్‌కు గురైన మహిళ ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. ఫోన్‌కు కనెక్ట్‌యిన స్మార్ట్‌వాచ్‌ సహాయంతో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు వారివురి మధ్య ట్రక్‌లోంచి సామాన్లు దించే విషయంలో వాదులాట జరిగిందని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది.

    ట్రక్ లోడింగ్ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణే ఈ కిడ్నాప్ కు కారణమని తేలింది. టెక్నాలజీని సరైన విధంగా వాడినప్పుడే సమాజానికి ఉపయోగపడే ఫలితాలు వస్తాయని మరోసారి నిరూపితమైంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: America, Apple, Crime, Crime news, Kidnap

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు