POLICE REVEALS SHOCKING TRUTHS IN SENSATIONAL JAGTIAL TRIPLE MURDER CASE SIX ARRESTED TILL NOW MKS KNR
Jagtial triple murder case: అతడు సినిమా ఫక్కీలో.. కేసు ఖర్చులకు రూ.50 లక్షలు చీటి వేసిమరీ హత్యలు..
ట్రిపుల్ మర్డర్ ఘటనా స్థలం దృశ్యాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జగిత్యాల ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు వెల్లడవుతున్నాయి. అతడు సినిమా ఫక్కీలో ప్లాన్ చేసిన నిందితులు.. కేసులు, కోర్టు ఖర్చుల కోసం ముందుగానే రూ.50 లక్షలు చిటీ వేసి సిద్ధంగా ఉండటం నివ్వెరపరుస్తోంది..
(P.Srinivas,News18,Karimnagar)
‘సర్వి తోపు దగ్గర 10 మందిని , చెరువు గట్టు దగ్గర మరో 10మందిని.. అక్కడా మిస్ అయితే పొలిమేరలో ఇంకో ఐదుగురిని పెట్టాను బావ .. వాడు తప్పించుకునే ప్రసక్తే లేదు..’ అంటూ అతడు సినిమాలో హీరోను చంపడానికి ప్రతినాయకులు వేసే ప్లాన్ గుర్తుందిగా. సరిగ్గా అదే థియరీని ఫాలో అయ్యారు జగిత్యాల ట్రిపుల్ మర్డర్ హంతకులు. అందుకే బాధితులు వేములవాడలో తప్పించుకున్నా జగిత్యాలలో దొరికిపోయారు. జగిత్యాల టీఆర్ నగర్ లో చోటుచేసుకున్న ట్రిపుల్ మర్డర్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి..
తమను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న నాగేశ్వరరరావు , అతని ముగ్గురు కుమారులు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీల్లేదని నిర్ణ యించుకున్న నిందితులు.. మొత్తం కుటుంబాన్ని మట్టుబెట్టాలని డిసైడ్ అయ్యారు. హత్య తర్వాత కేసు, కోర్టు ఖర్చుల కోసం ముందుగానే డబ్బు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కోర్టు కేసులకు అయ్యే ఖర్చులు కోసం రూ 50 . లక్షల చీటి డబ్బులు రెడీ చేసుకున్నారు. హత్య చేసిన తరువాత అరెస్టు , కోర్టులు , బెయిల్ , లాయర్లు ఈతతం గాలకు అయ్యే ఖర్చు మొత్తం భరించేందుకు నిందితులు ముందే సంసిద్ధం కావడం విశేషం.
సాధారణ హత్య కేసుల్లో ఎలా చంపాలి .. ? అని మాత్రమే నిందితుల ఆలోచన ఉంటుంది . కానీ విచిత్రంగా ఈ కేసులో మాత్రం అరెస్టు అయ్యాక ఏంచేయాలి .. ? ఎలా బయటపడాలి .. ? బెయిలుకు ఎంత ఖర్చవుతుంది .. ? అనే విషయాలను కూడా ముందే లెక్కలేయడం గతంలో తామెప్పుడూ చూడలేదని దర్యాప్తు అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రిపుల్ మర్డర్ కేసును సవాలుగా తీసుకున్న జగిత్యాల పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దాదాపు 96 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
జగిత్యాల ట్రిపుల్ మర్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రూపేశ్ , డీఎస్పీ ప్రకాశ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వ హించి ఆరుగురు ప్రధాన నిందితులను పట్టుకుని విచారించి మీడియా ముందు ప్రవేశపెట్టారు . ఇందుకోసం నిర్విరామంగా దాదాపు నాలుగు రోజులు శ్రమించారు . పట్టుబడ్డ నిందితుల వద్ద దాదాపు రూ .9.42 లక్షల నగదు దొరకడం వారి ఆర్థిక సన్నద్ధతను తెలుపుతోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.