Hyderabad: ఈ రోజు రాత్రి నా భర్త ఒక్కడే ఇంట్లో ఉంటాడు.. వెళ్లి పని పూర్తి చెయ్.. అంటూ భార్యే అతడికి ఫోన్ చేసి మరీ..

సీసీ కెమెరాలో నిందితుడి ఆనవాళ్లు

హైదరాబాద్ మహానగరంలో ఓ అద్దె ఇంట్లో ఫ్రిజ్ లో శవం బయటపడిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తిని చంపి, అతడి శరీరాన్ని బయటకు తరలించాలని ప్రయత్నించి కుదరకపోవడంతో చివరకు..

 • Share this:
  అనుమానమే నిజమయింది. హైదరాబాద్ మహానగరంలో ఓ అద్దె ఇంట్లో ఫ్రిజ్ లో శవం బయటపడిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తిని చంపి, అతడి శరీరాన్ని బయటకు తరలించాలని ప్రయత్నించి కుదరకపోవడంతో చివరకు ఫ్రిజ్ లో పెట్టాలనుకున్నారు. కానీ హతుడి శరీరం భారీకాయం కావడంతో అది కూడా కుదరక, సగం శరీరం ఫిజ్ లోనూ, మిగిలిన శరీరం నేలపైన ఉంచి ఇంట్లోంచి వెళ్లిపోయాడా వ్యక్తి. సీసీ కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డవడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎట్టకేలకు అతడిని పట్టేశారు. మృతుడి భార్య పాత్ర కూడా ఇందులో ఉండటంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్ లో సిద్దిఖ్ అహ్మద్ అనే 38 ఏళ్ల వ్యక్తి మార్చి 30న రాత్రిపూట దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఇంట్లోంచి వాసన రావడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య కూడా అంతకు రెండ్రోజుల ముందే పుట్టింట్లో ఫంక్షన్ ఉందంటూ వెళ్లిపోయింది. అదే సమయంలో హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మార్చి 31న ఉదయం 5.30 గంటల సమయంలో ఓ వ్యక్తి మృతుడి ఇంట్లోంచి రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఉండటంతో నిందితుడిని వెంటనే గుర్తించలేకపోయారు. అయితే ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవతం చేశారు. రెండ్రోజుల్లోనే అసలు నిందితులను పట్టేశారు.
  ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

  హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడింది అలీ అనే వ్యక్తిగా తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మెహిదీపట్నంలో ఉన్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సిద్ధిఖ్ భార్య రుబీనా తీరు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రుబీనాకు, అలీకీ చాలా కాలం నుంచే పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. బావమరిది ఇంట్లో శుభకార్యానికి మార్చి 30న హాజరయిన సిద్ధిఖీ, అదే రోజు రాత్రి ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే అతడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చిన రూబినా, అలీకి సమాచారం ఇచ్చింది. ఇంట్లో ఒంటరిగా తన భర్త ఉన్నాడనీ, ఈ రాత్రికే పని పూర్తి చేయాలని ప్రోత్సహించింది. దీంతో అలీ ఆ ఇంటికి వెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లో దాక్కున్నాడు. సిద్ధిఖ్ ఇంట్లోకి వెళ్లగానే, అతడు కూడా ఇంట్లోకి దూరాడు. హత్య చేసిన తర్వాత కూడా రుబీనాతో పలుమార్లు అలీ మాట్లాడాడు. శవాన్ని ఎలా మాయం చేయాలన్నదానిపై చర్చించారు. ఎటూ కుదరకపోవడం, తెల్లవారుతుండటంతో భయపడి సిద్ధిఖ్ శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి వచ్చేశాడు. ఆ తర్వాత విషయం బయటపడటంతో ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.
  ఇది కూడా చదవండి: కెనడాలో 27 ఏళ్ల తెలుగు కుర్రాడి ఆత్మహత్య వెనుక అసలు కారణమిదా..? ఇంటికి వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసి మరీ..
  Published by:Hasaan Kandula
  First published: