మరో ‘దిశ’కు యత్నం.. మహిళ చేతులు, కాళ్లు కట్టేసి.. ట్రక్కులో ఎత్తుకెళ్లి..

దిశ ఘటన జరిగి వారం కూడా కాకముందే మరో దారుణానికి కుట్ర పన్నాడో ట్రక్కు డ్రైవర్. దిశపై దారుణానికి ఒడిగట్టిన విధంగానే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడే యత్నం చేశాడు.

news18-telugu
Updated: December 5, 2019, 11:55 AM IST
మరో ‘దిశ’కు యత్నం.. మహిళ చేతులు, కాళ్లు కట్టేసి.. ట్రక్కులో ఎత్తుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ ఘటన జరిగి వారం కూడా కాకముందే మరో దారుణానికి కుట్ర పన్నాడో ట్రక్కు డ్రైవర్. దిశపై దారుణానికి ఒడిగట్టిన విధంగానే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడే యత్నం చేశాడు. ఓ యువకుడు చూశాడు కాబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే పశ్చిమ బెంగాల్‌లో మరో దిశ ఘటన జరిగి ఉండేది. వివరాల్లోకెళితే.. తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో ఓ ట్రక్కు డ్రైవర్ 30 ఏళ్ల వయసున్న చెవిటి, మూగ మహిళ కాళ్లు, చేతులు కట్టేశాడు. అనంతరం లారీ క్యాబిన్‌లో ఆమెను పడేసి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేందుకు కుట్ర పన్నాడు. అయితే.. ఓ యువకుడు క్యాబిన్‌లో నుంచి శబ్ధాలు రావడంతో అనుమానించి ట్రక్కు డ్రైవర్‌ను ప్రశ్నించబోయాడు. ఇంతలో డ్రైవర్ ట్రక్కుతో ఉడాయించాడు. ఆ యువకుడు కూడా ట్రక్కును ఫాలో అయ్యాడు. అయితే.. అతడొక్కడే రక్షించలేకపోయాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులు ఆ ట్రక్కును ఛేజ్ చేసేందుకు ప్రయత్నించగా, వారిని ట్రక్కుతో అడ్డగించాడు. అచ్చం సినిమాల్లో పోలీసు వాహనాన్ని అడ్డగించినట్లు ట్రక్కును ఇష్టమొచ్చినట్లు పోనిచ్చాడు.

ఓ సందర్భంలో పోలీసుల వాహనాన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. చివరికి 15 కిలోమీటర్ల దూరంలో ట్రక్కును అడ్డగించి, డ్రైవర్‌ను నిలువరించారు. ట్రక్కులోని క్యాబిన్‌లో వెతగ్గా మహిళ కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమెను కాపాడి, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అబ్దుల్ షేక్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా, ఆ మహిళ స్థానికురాలు కాదని, ఎవరూ లేని చోటు నుంచి నిందితుడు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులు వెల్లడించారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>