టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌తో పాటు... హీరో శివాజీ ఇంట్లో పోలీసుల సోదాలు

దీంతో అప్రమత్తమైన రవిప్రకాష్ అనుచరులు టీవీ 9 కార్యాలయం నుంచి కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: May 9, 2019, 2:21 PM IST
టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌తో పాటు... హీరో శివాజీ ఇంట్లో పోలీసుల సోదాలు
రవిప్రకాష్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: May 9, 2019, 2:21 PM IST
ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయంలోనూ కూడా తనిఖీలు చేస్తున్నారు. తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిధుల్ని కూడా ఆయన దారి మళ్లించారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది.అలంద మీడియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు తనిఖీలు చేపట్టారు.రవిప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. సంస్థకు హానికలిగించేలా శివాజీతో ఆయన కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. షేర్ల కొనుగోలు పేరుతో శివాజీ, రవిప్రకాష్ నాటకమాడరన్న అనుమానాలు కూడా యాజమాన్యం వ్యక్తం పరిచింది. సీఈఓ పదవి నుంచి ఆయనను యాజమాన్యం తొలగించింది. కంపెనీకి సంబంధించిన కీలక డేటా తస్కరించి బయట వ్యక్తులకు కూడా ఇచ్చినట్లు యాజమాన్యం అనుమానలు వ్యక్తంచేస్తోంది.

దీంతో అప్రమత్తమైన రవిప్రకాష్ అనుచరులు టీవీ 9 కార్యాలయం నుంచి కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతకొన్ని నెలల క్రితమే టీవీ9ను కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు రవిప్రకాష్‌కు ఆ సంస్థలో కేవలం 8 నుంచి 9 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ కొత్త యాజమాన్యం జోక్యం చేసుకోలేదు. అలంద మీడియా శ్రీనిరాజు సంస్థల నుంచి 90 శాతానికి పైగా వాటా కోనుగోలు చేసింది. నలుగురు డైరెక్టర్లను బోర్డులో చేర్చడానికి తీర్మానించింది. కేంద్ర సమాచార శాఖ అనుమతి ఇచ్చినా కొత్త డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్ అడ్డు తగిలారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాస్, అతని అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...