Medak: ఫామ్ హౌస్‌లో న‌యా దందా.. అర్ధ‌రాత్రి పోలీసులు దాడి చేయ‌డంతో..

ప్రతీకాత్మక చిత్రం

రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ‌స్తుల నుంచి భూములను కొనుక్కొని మరికొంతమందికి అమ్ముతూ ఉంటారు. అయితే రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి గ్రామాలలో భూములు కొనుకుంటున్న‌వారు అందులో ఏం చేస్తున్నారనేది గ్రామస్తులకు తెలియని పరిస్థితి.

  • Share this:
    రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ‌స్తుల నుంచి భూములను కొనుక్కొని మరికొంతమందికి అమ్ముతూ ఉంటారు. అయితే రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి గ్రామాలలో భూములు కొనుకుంటున్న‌వారు అందులో ఏం చేస్తున్నారనేది గ్రామస్తులకు తెలియని పరిస్థితి. కొంద‌రు.. ఫామ్ హౌస్ కట్టుకొని వారానికికొకసారి.. అందులో మద్యం సేవించి, పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది యువకులు.. అమ్మాయిలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలు నిర్వ‌హిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పోలీసులు పౌమ్ హౌస్‌ల‌పై దాడి చేసి ఐదు మందిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టిన ఘటన మెదక్ జిల్లా కౌడి పల్లి మండలం తునికి శివారులో(వెంకట్రావుపేట గ్రామ స‌మీపంలో) చోటు చేసుకుంది.

    తునికి చుట్టుపక్కల పల్లెల్లో భూములు తీసుకొని అందులో ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేసుకొన్నారు. పామ్ హౌస్ ల‌ చుట్టూ అడవి ప్రాంతం కావడంతో పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉంటుంది. ఇదే అద‌నుగా చేసుకుని కొంద‌రు ఫామ్ హౌస్ ల‌లో రేవ్ పార్టీలు జ‌రుపుతున్నారు. శని, ఆది వారాల్లో యువ‌త ఎంజాయ్ చేసేందుకు ఇక్క‌డి ఎక్కువగా వస్తూ ఉంటారు. కౌడిపల్లి మండల పరధిలోని తునికి వెంకటరావుపేట్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాలలోని ఫామ్ హౌస్ లు రేవ్ పార్టీలకు ఆవాసాలుగా మారుతున్నయి.

    ఆదివారం స్థానిక ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తునికి శివారులో(వెంకట్రావుపేట గ్రామ స‌మీపంలో) వ్యవసాయ పొలాల్లో శనివారం రాత్రి అమ్మాయిలు, అబ్బాయిలు మద్యం తాగి.. రాత్రి మూడు గంటల వరకు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఫామ్ హౌస్‌పై దాడి చేసి... బీదర్ చెందిన సంతోష్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ,ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వాచ్ మెన్‌ ప్రమోద్ యాదవ్ అదుపులోకి తీసుకోన్నారు. మరో ఐదుగురు అమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలు పరారీలో ఉన్న‌ట్టు చెప్పారు. అదుపులోకి తీసుక‌న్న వారిని విచారిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే గ‌తంలో ఓ పోలీసు అధికారి, మ‌రికొంద‌రితో క‌లిసి.. ఈ ఫామ్ హౌస్‌ను తీసుకున్న‌ట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ వ్యవసాయ భూమిలోనే ఇలా జరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: