పర్యాటక కేంద్రంలో ధ్వని కాలుష్యం... రూ.10 వేల జరిమానా

Dehradun : ఇది చిత్రమే. ఇండియా లాంటి దేశంలో... ధ్వని కాలుష్యం అనేది ఎంత ఉన్నా... సీరియస్‌గా తీసుకునేవాళ్లు చాలా తక్కువ మంది. అలాంటి మన దేశంలోనే సౌండ్ పొల్యూషన్‌పై రూ.10వేల జరిమానా వేశారంటే... ఎందుకో, అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 12:27 PM IST
పర్యాటక కేంద్రంలో ధ్వని కాలుష్యం... రూ.10 వేల జరిమానా
పర్యాటక కేంద్రంలో ధ్వని కాలుష్యం... రూ.10 వేల జరిమానా (Credit - Twitter - Peter Jones)
  • Share this:
Noise Pollution : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది ఈ అరుదైన ఘటన. ఇటీవల అక్కడ పబ్బులు, క్లబ్బులకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. వాళ్లకు ఎంజాయ్‌మెంట్‌ కోసం వాటి నిర్వాహకులు రూల్స్ పక్కన పెట్టేశారు. ఇష్టమొచ్చినట్లు సౌండ్లు పెంచేసి... అడ్డమైన డీజేలతో చుట్టుపక్కల నివసించేవాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఎన్నాళ్లని ఊరుకుంటారు. వాళ్లు వెళ్లి పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఒకేసారి డెహ్రాడూన్‌లోని మూడు ప్రాంతాల్లో ఉన్న పబ్బులు, క్లబ్బులు, బార్లపై దాడులు చేశారు. వాటిపై న్యూసెన్స్ కేసులు నమోదుచేశారు. అర్థరాత్రి తర్వాత కూడా చెవులు చిల్లు పడేలా డీజే మ్యూజిక్కులు ప్లే చేస్తున్నారని కంప్లైంట్లు రావడంతో ఈ రైడింగ్స్ జరిపినట్లు రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అశోక్ రాథోర్ తెలిపారు.

ది ఖాట్మన్స్, QB లాంజ్, ది గ్రేట్ ఇండియన్ పబ్, ది స్పాట్, బ్లాక్ పెర్ల్ వంటి క్లబ్బులపై దాడులు జరిగాయి. రూల్స్ అతిక్రమించి అత్యంత దారుణంగా సౌండ్లు పెట్టి... డీజే మోత మోగిస్తున్న ది ఖాట్మన్స్, QB లాంజ్ క్లబ్బులపై పోలీసులు... రూ.10వేల చొప్పున పైన్లు వేశారు. నిజానికి రూ.10 వేల జరిమానా క్లబ్బులకు చాలా చిన్నదే. వాటికి వచ్చే కస్టమర్లే వేలల్లో ఛార్జీలు చెల్లిస్తారు. సో... ఇంకా ఎక్కువ మొత్తంలో ఫైన్లు వెయ్యాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇలా సౌండ్ పొల్యూషన్‌పై పోలీసులు జరిమానాలు విధించే సందర్భాలు మన దేశంలో చాలా తక్కువ. కానీ... ఇటీవల రూల్స్ పక్కాగా అమలవ్వాలని కేంద్రం నుంచీ అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు వస్తున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో పోలీసులు లైట్ తీసుకోకుండా యాక్షన్ మొదలుపెడుతున్నారు. అది సరే... హైదరాబాద్‌లోనూ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగానే ఉంటోంది. అర్థం లేని పాటలు, ప్రయోజనం లేని సౌండ్లతో చాలా పబ్బులు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. మరి ఇక్కడి పోలీసులు సుమోటోగా చర్యలు తీసుకోవచ్చుగా. కేసులు రాసి... ఫైన్లు వేయొచ్చుగా అని అడుగుతున్నారు నెటిజన్లు.

 

ఇవి కూడా చదవండి :

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Health Tips : రోజూ నట్స్ తింటే... పడకపై సుఖమే సుఖం

దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయి? ఇవీ కారణాలు...


 
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading