మర్డర్ చేసిన వ్యక్తితో సెల్ఫీ తీసుకున్న పోలీసులు..

నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో జీపులో హంతకుడితో కలసి సెల్ఫీ దిగారు. హంతకుడితో పోలీస్ అధికారి సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమైంది.

news18-telugu
Updated: October 16, 2019, 3:31 PM IST
మర్డర్ చేసిన వ్యక్తితో సెల్ఫీ తీసుకున్న పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హత్య చేసిన వ్యక్తితో పోలీసులు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో సదరు పోలీసులపై వేటు పడింది. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలోని పూరి జిల్లాలో కొన్నాళ్లక్రితం అస్తరంగా ప్రాతంలో ఓ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి చంద్రబాబు పోలీస్ స్టేషన్ అధికారి బులు ముండా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో జీపులో హంతకుడితో కలసి సెల్ఫీ దిగారు. హంతకుడితో పోలీస్ అధికారి సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారి విషయం ఎస్పీ వరకు వెళ్లింది దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పోలీసులను కించపరిచేలా వ్యవహరించినందుకు సదరు చంద్రబాగా పోలీస్ స్టేషన్ అధికారి బులు ముండాపై చర్యలు తీసుకున్నారు. అతడిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading