మహిళా పోలీస్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు...వెంటాడి మరీ..

నిందితుడిని అలువా ట్రాఫిక్ పోలీస్ టీమ్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో అతడికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 9:59 PM IST
మహిళా పోలీస్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు...వెంటాడి మరీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె సివిల్ పోలీస్. అతడు ట్రాఫిక్ పోలీస్. ఇద్దరూ బాధ్యత గల వృత్తిలో ఉన్నవాళ్లే..! ఇరువురి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. అతడు ఆమెను కిరాతకంగా చంపేశాడు. వెంటాడి మరీ వేటాడాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. పెట్రోల్ పోసి సజీవంగా తగులబెట్టాడు. కేరళలో అలప్పుళలో ఈ ఘోరం జరిగింది. మృతురాలిని సౌమ్య పుష్కకరన్‌గా గుర్తించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని...భర్త విదేశాల్లో ఉంటాడని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..34 ఏళ్ల సౌమ్య వల్లికున్నమ్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని టూవీలర్‌‌పై ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు ఆమెను ఫాలో అయ్యాడు. కొంత దూరం వెళ్లాక ఓవర్‌టేక్ చేసి ఆమె స్కూటీకి ఎదురుగా కారును నిలిపివేశాడు. అనంతరం చేతిలో పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెతో బయటకు దిగాడు. అతడిని చూసి సౌమ్య పరుగులు పెట్టింది. సమీపంలోకి ఓ ఇంట్లోకి వెళ్లి కాపాడుకునేందుకు ప్రయత్నించింది. ఐనా అతడు వదల్లేదు. ఇంట్లోకి దూసుకొచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోయి స్పాట్‌లోనే ఆమె చనిపోయింది.

ఇరుగుపొరుగు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. నిందితుడిని అలువా ట్రాఫిక్ పోలీస్ టీమ్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో అతడికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు పోలీస్ అధికారిణిపై పెట్రోలో పోసి తగులబెట్టడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు