మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులు... అరెస్ట్...

Guwahati : ఓ మహిళా జర్నలిస్టుకే రక్షణ లేకపోతే... ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 8:53 AM IST
మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులు... అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 8:53 AM IST
Assam : అది అసోం... గౌహతిలోని... అహి రహే ప్రాంతం. రాత్రి వేళ బస్టాండ్ దగ్గర బస్సు కోసం ఎదురు చూడసాగింది మహిళా జర్నలిస్ట్ గాయ్ కాయ్ కసాయ్ చిత్త బహ్హా. ఐతే... ఆమె దురదృష్టం కొద్దీ బస్సు వెంటనే రాలేదు. ఈలోగా... అక్కడకు వచ్చాడు ఓ కేటుగాడు. టైమెంత అని ఆమెను అడిగాడు... 8న్నర అంది ఆమె. ఐతే... గాయ్ కాయ్‌కి అప్పుడే కాల్ వచ్చింది. ఆమె దగ్గరున్న న్యూ్స్, వీడియో రికార్డర్ టేప్ త్వరగా తేవాలని... అవతలి వాళ్లు అడిగారు. ఆమె... బస్సు కోసం చూస్తున్నాననీ, బస్సు వస్తే... అరగంటలో తెచ్చేస్తాననీ చెప్పింది. అది విన్న కేటుగాడు... మీరు జర్నలిస్టా అని అడిగాడు. అవునన్నట్లు తలూపింది గాయ్ కాయ్. నేనూ జర్నలిస్టునే అంటూ ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఇక్కడ ఇదే సమస్య. బస్సులు త్వరగా రావు అంటూ... మీ వాచ్ చాలా బాగుంది... అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. వెంటనే ఆమె కోపంగా చూసింది. అంతే చెయ్యి వదిలేశాడు.

అతనిపై అనుమానం వచ్చిన కాయ్ కాయ్... కాస్త పక్కకు జరిగింది. చుట్టూ ఎవరైనా ఉంటే బాగుండని చూసింది. అదో నిర్మానుష్య ప్రాంతం కావడంతో అక్కడ ఎవరూ లేరు. పైగా స్టీట్ లైట్ కూడా చచ్చీ చెడీ అతి కష్టమ్మీద వెలుగుతోంది. కాయ్ కాయ్‌కి లోలోపల టెన్షన్ మొదలైంది. ఈసారి ఆమె వెనక నుంచీ నడుస్తూ... ఆమెకు మరోవైపు వెళ్లాడు. మీ జుట్టుపై ఏంటది అంటూ... ఆమె జుట్టుపై చెయ్యి వేసి... నిమురుతూ... ఏదో పురుగు వాలినట్లుంది. అన్నాడు. తీసేశాను అన్నాడు. ఆమె షాకైంది. మెల్లిగా దగ్గరకు జరిగి... మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు... ఏంటి మీ సీక్రెట్ అంటూ మరింత దగ్గరకు జరుగుతుండగా... ఆమె రెండడుగులు దూరంగా వేసింది. ఎందుకు భయపడుతున్నారు... అంటూ ఆమె నడుంపై చెయ్యి వేస్తుంటే... ఆమె బలంగా పక్కకు తప్పుకుంది... ఇంతలో అటుగా బస్సు రాసాగింది.

హమ్మయ్య అనుకున్న ఆమె... బస్సు ఎక్కుతూనే... అతను తనను లైంగికంగా వేధించాడని బస్ డ్రైవర్‌కి చెప్పింది. అంతే... బస్సులో ఉన్న కొంత మంది కుర్రాళ్లు వెంటనే దిగి... వాణ్ని చితకబాదారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అతని పేరు దాహన్ ఖాట్నియా అని తెలిసింది. కేసు రాసిన పోలీసులు... అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...