పోలీసు అధికారి కొంపముంచిన వివాహేతర సంబంధం.. మహిళ ఫిర్యాదుతో విచారణ జరిపితే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళతో వివాహేతర సంబంధం పోలీసు అధికారి కొంపముంచింది. ఉద్యోగ జీవితంలో అతనిక ఊహించని షాక్ తగిలింది.

 • Share this:
  పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. అంతేకాకుండా వీటిద్వారా తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఓ పోలీసు అధికారికి ఎదురైంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం అతని కొంపముంచింది. ఉద్యోగ జీవితంలో అతనిక ఊహించని షాక్ తగిలింది. ఒక ఏడాది పాటు అతని ఇంక్రిమెంట్ రద్దు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైకి చెందిన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ధన్‌రాజ్‌ ప్రభాలే అక్కడి నాగ్‌పాద పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లైంది. కొన్ని నెలల క్రితం ఓ మహిళ తన క్యాటరింగ్‌ బిజినెస్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. దాన్ని చూసిన ధన్‌రాజ్‌ ఆమెకు బిజినెస్‌ విషయంలో సహాయం చేస్తానంటూ పరిచయం పెంచుకున్నాడు.

  క్యాటరింగ్ వ్యాపారాన్ని స్థాపించడంలో ఆమెకు సహాయం చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరు మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేసేవారు. అయితే ఆకస్మాత్తుగా ధన్‌రాజ్‌పై ఆ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు సహాయం చేస్తానని చెప్పిన ధన్‌రాజ్‌ వాడుకున్నాడని ఆరోపించింది. దీంతో ఉన్నతాధికారులు ధన్‌రాజ్‌పై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. అందులో అతడు దోషిగా తేలాడు. అతని చర్యలు పోలీసు శాఖపై చెడు అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని విచారణ జరిపిన అధికారులు గుర్తించారు.

  13 ఏళ్ల బాలికపై ఐపీఎస్ అధికారి నీచపు పని.. చార్జ్ షీట్‌లో అభియోగాలు.. అంతలోనే ఊహించని విధంగా..

  ఈ క్రమంలోనే ధన్‌రాజ్‌పై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఓ సంవత్సరం పాటు ఇంక్రిమెంట్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ఇది చాలా పెద్ద శిక్ష. పోలీసు అధికారి ప్రమోషన్‌ విషయంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో కొన్ని మెడల్స్‌ అందుకోవటానికి కూడా అతడు అనర్హుడు’అని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: