షాద్‌నగర్‌లో లాఠీ చార్జి.. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పోలీసుల్లో నెలకొంది.

news18-telugu
Updated: November 30, 2019, 3:38 PM IST
షాద్‌నగర్‌లో లాఠీ చార్జి.. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
షాద్‌నగర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం
  • Share this:
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకులు,ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన పోలీసుల్లో నెలకొంది. దీంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఐదు విభాగాల పోలీసులను రంగంలోకి దించారు. స్వల్ప లాఠీ చార్జితో ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. స్థానికంగా ఉన్న దుకాణాలన్నింటిని మూసివేశారు. భవనాల పైకి ఎక్కినవారిని కిందకి దిగి అక్కడినుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఐదు విభాగాల పోలీసులను అక్కడ మోహరించారు. సాయంత్రం 4.30గంటల లోపు నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: November 30, 2019, 3:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading