POLICE HAVE STOPPED TWO SCHOOLGIRLS FROM SELLING THEIR VIRGINITY BS
వర్జినిటీని అమ్ముకుంటున్న స్కూల్ విద్యార్థినులు.. రూ.6.5 లక్షలకు బేరం..
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ Nikodash/ IStock.com)
Crime News: విద్యార్థినులను అర్టెమియ్(18) అనే వ్యక్తి సంప్రదించి, సెక్స్ చేయాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 7300 పౌండ్లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ బాలికలు కూడా సరేనన్నారు. ఓ రహస్య ప్రదేశంలో సెక్స్ చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
బాలికలతో శృంగారం చేయాలని చూశాడో వ్యక్తి.. ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లొంగదీసుకున్నాడు.. వారికి మాయమాటలు చెప్పి సెక్స్‌కు ఒప్పించాడు.. అందుకు ఒక్కొక్కరికి రూ.6.5లక్షలు ఇస్తానని బేరం కూడా కుదుర్చుకున్నాడు. అభం శుభం తెలియని ఆ విద్యార్థినులు(15 ఏళ్ల వయసు) తమ వర్జినిటీని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. రష్యాలోని మాస్కోలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను అర్టెమియ్(18) అనే వ్యక్తి సంప్రదించి, సెక్స్ చేయాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 7300 పౌండ్లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ బాలికలు కూడా సరేనన్నారు. ఓ రహస్య ప్రదేశంలో సెక్స్ చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే, ఆ విషయం పోలీసులకు తెలియడంతో ముందు జాగ్రత్తగా పక్కా ప్రణాళిక అమలు చేశారు. ఆ బాలికలకు బదులు పోలీసులే సివిల్ దుస్తుల్లో వెళ్లి బాలికల తరఫున వచ్చామని అర్టెమియ్ను నమ్మించారు.
నిజమేమోననుకున్న ఆ వ్యక్తి ఒప్పందం సంగతి చెప్పాడు. రెడ్ హ్యాండెడ్‌గా అతడ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌ను తరలించారు. బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు యత్నించాడని కేసు నమోదు చేసి ఊచలు లెక్కిపెట్టిస్తున్నారు. బాలికలను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఆరా తీశారు. ఆ బాలికలు.. వర్జినిటీని తమ ఇష్టంతోనే కోల్పోవాలనుకున్నట్లు తెలిపారు. సహాయం చేయాలని తామే అతడ్ని కోరామని వెల్లడించారు. కాగా, ఆ బాలికలిద్దరూ స్నేహితులేనని, ఒకే తరగతి చదువుతున్నట్ల తేలింది. దీనిపై స్పందించాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరగా.. విద్యార్థినుల భవిష్యత్తును పాడు చేయొద్దన్న ఉద్దేశంతో గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.