POLICE HAVE RESCUED 17 YOUNG WOMEN FROM A SECRET ROOM IN DEEPA BAR IN ANDHERI MAHARASHTRA PRV
Maharashtra: సొరంగంలో నుంచి బయటకొచ్చిన 17 మంది అమ్మాయిలు.. పోలీసులు షాక్.. ఇంతకీ ఏంటీ కథ.. ఎక్కడ జరిగింది..
సీక్రెట్ రూమ్ నుంచి బయటికొస్తున్న యువతులు (photo:𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚/Twitter)
ఇటీవలె కర్ణాటకలోని లాడ్జ్‌లో అండర్‌గ్రౌండ్‌లో వ్యభిచారం సాగించిన సంగతి తెలిసిందే. హైవేపై కండోమ్ ప్యాకెట్లు కుప్పలుతెప్పలుగా పడి ఉండటంతో పోలీసులు విచారణ చేయగా ఆ సొరంగం బయటపడింది. అయితే ఇలాంటి సొరంగమే ఇపుడు మహారాష్ట్రలోనూ బయటపడింది.
ఇటీవలె కర్ణాటకలోని లాడ్జ్‌లో అండర్‌గ్రౌండ్‌లో వ్యభిచారం సాగించిన సంగతి తెలిసిందే. హైవేపై కండోమ్ ప్యాకెట్లు కుప్పలుతెప్పలుగా పడి ఉండటంతో పోలీసులు విచారణ చేయగా ఆ సొరంగం (Tunnel) బయటపడింది. అయితే ఇలాంటి సొరంగమే ఇపుడు మహారాష్ట్ర (Maharashtra) లోనూ బయటపడింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో మహారాష్ట్రలోని ఓ బార్‌పై అక్కడి పోలీసులు దాడులు (Police Raids) చేశారు. బార్ మొత్తం వెతికినా వారికి అక్కడ ఏమంత తప్పు దొరకలేదు. కానీ అక్కడున్న ఓ అద్దం (Mirror)పై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ అద్దాన్ని తీయాల్సిందిగా నిర్వాహకులను కోరినా ఏమీ లేదని బుకాయించారు. దీంతో అద్దాన్ని పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యంతో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఆ అద్దం వెనుకాల ఏం ఉంది అంటారా? ఇది చదవండి..
పోలీసులు పగలగొట్టిన ఆ అద్దం వెనకాల ఓ సీక్రెట్ రూమ్ (Secret Room) బయటపడింది. అందులోకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 యువతులు (Young women) ఒకరి వెనక ఒకరు బయటకు వస్తుండటంతో పోలీసులు షాక్ అయ్యారు. సీక్రెట్ బేస్‌మెంట్‌లో ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
ముంబై అంధేరిలోని దీప బార్ (Deepa bar in Andheri)పై ఆదివారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. దీప బార్‌లో యువతులను కస్టమర్ల ముందు వికృతంగా డ్యాన్స్ (dance) చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు బార్‌పై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడి గురించి సమాచారం అందుకున్న బార్ యాజమాన్యం అప్రమత్తమై యువతలను వెంటనే ఓ రహస్య గదిలోకి పంపారు.
మేకప్ రూమ్‌లో..
అయితే వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు (Police) గంటలపాటు బార్ మొత్తం కలియతిరిగారు. సెర్చ్ (Search) చేసినా ఎవరూ దొరకలేదు. వాష్‌రూం, కిచెన్, స్టోర్‌రూమ్‌లలో వెతికినా మొత్తం ఖాళీగా ఉంది. అయితే పోలీసులకు అప్పటికీ నమ్మకం కలగలేదు. అంతేగాక మేకప్ రూమ్‌లో తగిలించి ఉన్న పెద్ద అద్దం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. పోలీసులు ఆ అద్దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా.. అది కుదరలేదు.
అద్దం వెనకాల పెద్ద సొరంగం..
ఓ పెద్ద సుత్తి తీసుకొచ్చి అద్దాన్ని (mirror) పగలగొట్టారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. అద్దం వెనకాల పెద్ద సొరంగంలా ఉన్న ఓ రహస్య గది ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది.
ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు వచ్చారు. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశారు. యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయట వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే సీక్రెట్ రూమ్‌ను రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో బెడ్స్, ఏసీలు అన్నీ ఉన్నాయి. బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 17 మంది యువతలను పోలీసులు రక్షించి.. రెస్క్యూ హోంకు తరలించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.