Home /News /crime /

POLICE HAVE ISSUED SEVERAL SUGGESTIONS TO SUCH PERSONS IF THEY ARE GOING TO THEIR HOMETOWN DURING THE FESTIVAL MBNR PRV

Thefts: పండుగలకు ఊరెళుతున్నారా? ఇంట్లో ఎవరూ ఉండటం లేదా? అయితే ఒక్కసారి ఈ పోలీసులు చెప్పేది వినండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సందర్భంగా ఇంటి దగ్గర ఎవరూ లేకుంటే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు పోలీసులు తగిన జాగ్రత్తలు (Precautions)వెల్లడించారు.

  (న్యూస్ 18, మహబూబ్​నగర్​, సయ్యద్ రఫీ)

  సెలవులు వచ్చాయంటే చోరీల (Theft) పరంపర కొనసాగుతుంది. దసరా, దీపావళి సంక్రాంతి పండుగ వేళల్లో (Festival time) ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఏటా సెలవుల్లోనే దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతేడాది ఒక మహబూబ్ నగర్ జిల్లాలోని 279 చోరీలు (Theft) జరిగాయి. రూ 2.18 కోట్ల నగదు బంగారం ఇతర వస్తువులు దొంగల పాలయ్యాయి. ఈనెల 11న అడ్డాకుల మండల కేంద్రంలో నివసించే ఓ మహిళ తల్లి గారి గ్రామానికి వెళ్లారు. రాత్రికి అక్కడే ఉండి ఉదయం తిరిగి వచ్చారు. తాళం తీసి ఉండటం చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా చోరి జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అల్మారాలో దాచిన రూ 20, వేలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

  ఈనెల 12న చర్చల పట్టణం నడిబొడ్డున సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దత్తాత్రేయ ఆలయం సమీపంలో ఉంటున్న అర్చకుడు సొంతూరు వెళ్ళాడు. ఇంటి తాళం తీసి ఉండటంతో పొరిగింటి వారు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చూడగా రూ. 60 వేల నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. దీంతో పండుగ సందర్భంగా ఎవరైనా సొంతూళ్లకు వెళ్లాలనుకున్నా.. ఏదైనా విహార యాత్ర ప్లాన్​ చేసుకున్నా.. ఇంటి దగ్గర ఎవరూ లేకుంటే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు పోలీసులు తగిన జాగ్రత్తలు (Precautions)వెల్లడించారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

  పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు ..

  ★సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇంటి యజమానులు ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలి.

  ★తలుపులకు నాణ్యమైన తాళాలు వేయాలి.

  ★ఇంటి వరండాలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి వాటిని ఫోన్ కు అనుసంధానం చేసుకోవాలి. కావలసినప్పుడు ఫోన్ ద్వారా ఇంటి పరిసరాలను గమనించవచ్చు. అనుమానితులు ఎవరైనా ఇంటి పరిసరాల్లో కనిపిస్తే వెంటనే ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయవచ్చు.

  ★సెలవులకు ఇతర గ్రామాలకు వెళ్లినప్పుడు చిరునామా ఫోన్ నెంబరు తదితర వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలపాలి. పోలీసులు పగలు రాత్రి పూట గస్తీ తిరుగుతూ నిఘా పెడతారు.

  ★చోరీ జరిగాక ఇంట్లో వస్తువులను ముట్ట రాదు దొంగల వేలిముద్రలను క్లూస్ టీమ్ వారు సులువుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

  ★రాత్రిపూట ఇంటిని చీకటిగా ఉంచరాదు తెలుగు వచ్చి విద్యుత్ దీపాలు వెలిగించాలి.

  ★తాళం తీస్తే శబ్దం వచ్చేలా నూతన సాంకేతిక విధానాలు ఉపయోగించాలి.  నిరంతరం గస్తీ లు నిర్వహిస్తున్నాం..

  మహబూబ్​నగర్​ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘సెలవుల్లో చాలా మంది ఇంటి యజమానులు సొంతూళ్లో బంధువుల వద్దకు వెళుతుంటారు. అలాంటి వారు పోలీసులకు వివరాలు అందించాలి. చోరీలు జరగకుండా కాలనీ యువకులు పోలీసులకు సహకరించాలి. మా సిబ్బంది రాత్రింబవళ్ళు కాలనీలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే 100 కు ఫోన్ చేయాలి. క్లూస్ టీం లను పంపించి విచారణ చేస్తాం . అని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం”అని ఆయన తెలిపారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mahbubnagar, Police, Theft

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు