Home /News /crime /

POLICE HAVE IDENTIFIED A MISSING WOMAN AS BEING KILLED BY A TEMPLE PRIEST IN MALKAJGIRI HYDERABAD SNR

Hyderabad: గుడికి వచ్చిన పెద్దావిడపై పూజారి కన్ను..అందుకోసమే హతమార్చాడు

(నగల కోసం హత్య)

(నగల కోసం హత్య)

Hyderabad Murder:రామా,కృష్ణా అనుకుంటూ గుళ్లు, గోపురాలకు వెళ్తున్న మహిళను దారుణంగా హత్య చేశారు. నాలుగు రోజుల క్రితం గుడికి వెళ్లిన ఉమాదేవిని ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హతమార్చారు. చంపింది ఎవరో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

జీవితంలో కష్ట, సుఖాలన్నింటిని అనుభవించారు. శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న దంపతులు వాళ్లు. బాధ్యతలను నిర్వర్తించి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అవకాశం ఉన్నప్పుడు బంధువులతో ఫోన్లలో మాట్లాడటం, మిగిలిన సమయంలో గుడికి వెళ్తూ కాలక్షేపం చేస్తున్న దంపతులపైన కూడా విధి పగబట్టింది. హైదరాబాద్(Hyderabad) మల్కాజ్‌గిరి (Malkajgiri)లో రిటైర్మెంట్ వయసు దాటిన ఓ మహిళ మానసిక ప్రశాంతత కోసం రోజూ ఇంటి సమీపంలో ఉన్న స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయంతో పాటు విష్ణుపురిలోని శివాలయానికి వెళ్తూ ఉండేది. గుడిలో దేవుడితో పాటు చుట్టు పక్కల రాక్షసుడు మారువేషంలో తిరుగుతున్నాడని గ్రహించలేకపోయింది. ఆ రాక్షసుడి వల్ల తనకు ప్రాణహాని పొంచివుందని పసిగట్టలేకపోయింది. ఫలితంగా 57ఏళ్ల మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో జరిగిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. మల్కాజ్‌గిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీ(Vishnupuri Extension Colony)లో ఉమాదేవి (Umadevi), ఆమె భర్త జీవీఎన్‌ మూర్తి(GVN murthy)తో కలిసి నివాసముంటున్నారు. ఈదంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు బాగా చదువుకొని ఆస్ట్రేలియాAustraliaలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(Software Engineer)గా జాబ్ చేస్తున్నాడు. కుమార్తెకు గత నెల 27వ తేదిన వివాహం జరిపించారు. బాధ్యతల్ని నిర్వహించి ఇద్దరూ కలిసి పండు దంపతుల్లా కాలనీలో ఉంటున్నారు. రైల్వేశాఖRailwaysలో ఉద్యోగం చేస్తున్న మూర్తి కొడుకు సెటిలవడం, కూతురు పెళ్లి చేయడంతో వీఆర్‌ఎస్‌(vrs) తీసుకున్నారు. ఏ బాధలు లేవు. ఎవరితో శత్రుత్వం, పగలు, ఆర్ధికపరమైన ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో విభేదాలు, ఆస్తి గొడవలు ఏమి లేవు. ఉన్నతంగా శేష జీవితాన్ని దేవుడ్ని స్మరించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి ప్రశాంతమైన కుటుంబంలో కలకలం మొదలైంది. ఈనెల 18వ తేదిన 57సంవత్సరాల మహిళ ఉమాదేవి అదృశ్యమైంది. ఇంటి సమీపంలో ఉన్న స్వయంభూ గణపతి ఆలయానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత సేపటికి ఉమాదేవి ఇంటికి చేరకపోవడంతో భర్త జీవీఎన్‌ మూర్తి మల్కాజ్‌గిరి ఫోలీసు(Police)లకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమాదేవి జాడ కోసం విస్తృతంగా గాలించారు.

అంతా హ్యాపీగా ఉన్న టైమ్‌లో..
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లి ఉంటుంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే విషయం ఆరా తీస్తుండగా మిస్సింగ్ కేసు కాస్త డెత్‌గా తేలింది. గురువారం సాయంత్రం కాలనీలోని స్వయంభూ సిద్దివినాయక ఆలయం వెనుక ఉమాదేవి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహంపై గాయాలు ఉండటం, ఉమాదేవి ఒంటిపై ఉన్న10తులాల బంగారు నగలు మాయం అయ్యాయి. ఘటన స్తలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యగా తేల్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉమాదేవిని నగల కోసం హతమార్చి వాటిని తీసుకొని పారిపోయి ఉంటారని భావించారు.

చివరి రోజుల్లో తీరని విషాదం..
ఒంటిపై లక్షల విలువ చేసే నగలు వేసుకొని రోజూ గుడికి వెళ్తున్న ఉమాదేవిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసులు ఆరా తీయగా గుడి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ గమనించడంతో అసలు హంతకుడు దొరికాడు. ఉమాదేవి మెడలో నగల కోసం పూజారి మురళి ఆమెను హత్య చేసి ఒంటిపై నగలు ఎత్తుకెళ్లాడని నిర్ధారించారు. నిజం తెలిసిన వెంటనే పోలీసులే షాక్ అయ్యారు. నిందితుడ్ని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

నగలే ప్రాణం తీశాయా..
గుడికి వెళ్లే భక్తులు పూజారిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి పూజారి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడని తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. మృతురాలి దగ్గర నుంచి తీసుకున్న నగలను పోలీసులు రికవరీ చేసుకున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Old women killed

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు