ఢిల్లీలో శ్రద్దా వాకర్ (Shraddha walker)అనే యువతిని దారుణంగా హతమార్చి కిరాతక ప్రేమికుడిగా ముద్రవేసుకున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాల(Aftab Amin Poonawala)ను అరెస్ట్ చేసి రిమాండ్(Remand)లోకి తీసుకున్న పోలీసులు నమ్మలేని నిజాల్ని రాబడుతున్నారు. నిజంగా మనిషిగా పుట్టిన వాడు ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టాడని ఆశ్చర్యపోతున్నారు పోలీసులు. విచారణలో మృతురాలు శ్రద్ధా వాకర్ స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్స్(Whatsapp Chatting Screenshots)ని సేకరించారు. అయితే నిందితుడు ఆఫ్తాబ్ అమీన్..యువతిని క్షణికావేశంలో కాకుండా ..అత్యంత ఉన్మాదంతో..ఉద్దేశ పూర్వకంగానే చిత్రహింసలకు గురి చేసి చంపినట్లుగా నిర్ధారించారు. ఇక హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాల్ని 35ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టి రోజుకు కొన్ని భాగాల్ని బ్యాగులో తీసుకెళ్లిన దృశ్యాలను సేకరించారు. ఆ బ్యాగును కూడా రికవరీ చేసుకున్నారు.
కిరాతక ప్రేమికుడి వీడియో వైరల్ ..
ఉద్యోగం చేస్తున్న దగ్గర పరిచయమైన యువతిని ప్రేమతో దగ్గరై సహజీవనం చేస్తూనే ఆమెపై కసి తీర్చుకున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా కేసులో కీలకమైన విషయాలు, నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. మృతురాలు శ్రద్ధా వాకర్‌ను అక్టోబర్ 18వ తేదిన 35 ముక్కలుగా కోసి చంపిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు చెందిన కీలక ఆధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించారు. అక్టోబర్ 18వ తేదీన అతను ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. గర్ల్‌ఫ్రెండ్ శ్రద్ధా శరీర భాగాలను పడేసేందుకు అతను ఆ బ్యాగ్‌ను వాడినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని మూడుసార్లు రౌండ్లు కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు.
#WATCH | Shraddha murder case: CCTV visuals of Aftab carrying bag at a street outside his house surface from October 18 pic.twitter.com/S2JJUippEr
— ANI (@ANI) November 19, 2022
చంపే ముందు చిత్రహింసలు..
మర్డర్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడ్ని విచారించిన మెహరౌలీ పోలీసులకు ఆఫ్తాబ్ నిజాలు చెబుతున్నాడు. మర్డర్ చేసిన రోజున తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. నిందితుడు గంజాయి తీసుకునేవాడని విచారణలో తెలిసింది. యువతి మృతదేహాల జాడ కోసం మెహ్రౌలీ అడవిలో వరుసగా ఆరో రోజు పోలీసులు వెతికారు. ఈ కేసులో విచారణ కోసం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పోలీసులు వెళ్లారు.
బ్యాగులో శ్రద్ధ డెడ్ బాడీ ముక్కలు..
మృతురాలు శ్రద్ధా వాకర్ కొలిగ్స్‌తో పాటు స్నేహితులను విచారిస్తున్నారు పోలీసులు. అయితే చనిపోయే ముందు శ్రద్ధా చేసిన వాట్సాప్ చాటింగ్‌కు చెందిన స్క్రీన్‌షాట్లు బయటకు వచ్చాయి. అయితే శ్రద్ధాను అఫ్తాబ్ చాలా హింసించినట్లు ఆ చాటింగ్ ద్వారా గుర్తించారు పోలీసులు. శ్రద్ధా ముఖానికి, మెడకు గాయాలైన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Delhi news