Home /News /crime /

Sugandhi: హాట్‌హాట్ ఫోజులు.. యూట్యూబ్‌లో వీడియోలు.. ఇంత చేస్తే చివరకు ఈమెకు ఏమైందో చూడండి..

Sugandhi: హాట్‌హాట్ ఫోజులు.. యూట్యూబ్‌లో వీడియోలు.. ఇంత చేస్తే చివరకు ఈమెకు ఏమైందో చూడండి..

ఓ వీడియోలో సుగంధి

ఓ వీడియోలో సుగంధి

సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌లో వచ్చే క్రేజ్ కొన్ని సందర్భాల్లో లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంది. హద్దు మీరి దురుద్దేశపూర్వకంగా పోస్ట్‌లు పెట్టినా, వీడియోలు పోస్ట్ చేసినా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు.

  సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌లో వచ్చే క్రేజ్ కొన్ని సందర్భాల్లో లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంది. హద్దు మీరి దురుద్దేశపూర్వకంగా పోస్ట్‌లు పెట్టినా, వీడియోలు పోస్ట్ చేసినా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. తమిళనాడులో ఓ మహిళ విషయంలో అదే జరిగింది. ఆమె ఎవరంటే.. భారత్‌లో టిక్‌టాక్ వినియోగించిన రోజుల్లో కొందరు ఆ యాప్ ద్వారా వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. కొందరు తమలోని టాలెంట్‌కు పదును పెట్టి వినూత్నంగా వీడియోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంటే మరికొందరు హాట్‌హాట్ వీడియోలతో కుర్రకారును ఆకర్షిస్తూ వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకున్నారు.

  అలా పాపులర్ అయిన వాళ్లలో తమిళనాడుకు చెందిన సుగంధి అనే మహిళ ఒకరు. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తుండేవాడు. వీళ్లకు సంవత్సరం వయసున్న పాప కూడా ఉంది. టిక్‌టాక్‌లో హాట్‌హాట్ వీడియోలు చేస్తూ.. ఆ క్రేజ్ మోజులో పడి చివరకు భర్తను కూడా దూరం చేసుకుంది. కూతురిని తీసుకుని ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉంటోంది. టిక్‌టాక్‌లో దివ్య అనే మహిళతో వీడియోల రూపంలో వాగ్వాదానికి దిగేది. ఇద్దరూ నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ అక్కరకు రాని పాపులారిటీ కోసం దుర్భాషలాడుకుంటూ చూసేవాళ్లకు వినోదాన్ని పంచి పలుచనయ్యారు.

  ఇది కూడా చదవండి: After Taking a Bath: నువ్వెక్కడి కోపదారి మనిషివయ్యా బాబూ.. స్నానం చేశాక ఎవరైనా ఇలా చేస్తారా..

  దివ్యను ఇలా సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన కేసులో అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత కూడా సుగంధి తీరు మారలేదు. తనను కామెంట్ చేసిన వాళ్లకు నోటితో చెప్పలేని బూతులతో తిడుతూ వీడియోలు చేసేది. టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత సుగంధి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. యూట్యూబ్‌లో తన పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంది. అందులో వీడియోలు చేసేది. ఆ వీడియోల్లో కూడా తనను సమర్థించని వాళ్లను సుగంధి బండ బూతులతో తిట్టిపోసేది. తోటి స్త్రీలను కూడా తక్కువగా చేసి.. పరుష పదజాలంతో నీచంగా దూషించేది. వాళ్ల ఫొటోలను, వీడియోలను వాడి మరీ తనను సమర్థించే వారితో అసభ్యకర రీతిలో సంభాషణలు చేసేది. సుగంధిని తాజాగా మధురై పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇది కూడా చదవండి: Wife: భర్త కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. డౌటొచ్చి..


  మధురైకి చెందిన ఓ మహిళ ప్రతిష్టను దిగజార్చే విధంగా సుగంధి ఆమె భర్తతో కలిసి ఉన్న వీడియోలను పోస్ట్ చేసి ఆ వీడియోపై అసభ్యకర రీతిలో సంభాషణలు జరిపింది. ఆ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు సుగంధి తప్పు చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అప్పటికే ఆమె పరారయింది. ఎట్టకేలకు పోలీసులు సుగంధిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్ట్‌లు, వీడియోలు పెడితే చిక్కుల్లో పడక తప్పదని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సుగంధి టిక్‌టాక్‌లో బాగా ఫేమస్ అయిన సమయంలో ఆమెతో కొన్ని ఘాటు రొమాన్స్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్స్ కూడా కొందరు తీశారు. చివర్లో ఏదో సమాజానికి సందేశం ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి వీడియో చివరి వరకూ సుగంధి హాట్ రొమాన్స్‌తో వీడియోలను తీసి కొందరు సొమ్ము చేసుకున్నారు. ఆమె కూడా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అలాంటి సీన్లు తీసినప్పటికీ కాదనకుండా నటించింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, CYBER CRIME, Social Media, Tamilnadu, Tiktok video

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు