Home /News /crime /

SBI: రూ.200 కోట్ల ప్రాపర్టీని రూ.25 కోట్లకే అమ్మేసిన ఎస్​బీఐ.. బ్యాంక్​ మాజీ చైర్మన్​ను జైలుకు పంపిన కోర్టు

SBI: రూ.200 కోట్ల ప్రాపర్టీని రూ.25 కోట్లకే అమ్మేసిన ఎస్​బీఐ.. బ్యాంక్​ మాజీ చైర్మన్​ను జైలుకు పంపిన కోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టే‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్టు అవడం సంచలనం రేకెత్తించింది. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్‌ రూ.25 కోట్లకు విక్రయించడం... లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    స్టే‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (state bank of india) మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి (Pratip Chaudhuri) సోమవారం అరెస్టు అవడం సంచలనం రేకెత్తించింది. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్‌ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించడం లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఢిల్లీలో ఆయనను అరెస్ట్‌ చేసి, జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జైసల్మేర్​ కోర్టు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రతీప్​ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

    2010లో మొండి బకాయిగా..

    పోలీసుల వివరాల ప్రకారం.. 2007లో రాజస్తాన్​లోని  జైసల్మేర్‌ (Jaisalmer‌)లో గర్‌ రాజ్‌వాడ హోటల్‌ ప్రాజెక్టుకుగాను గోడవన్‌ గ్రూప్‌నకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టులో ఆశించినంత పురోగతి లేదు. దీంతో 2010లో ఈ అకౌంట్‌ మొండి బకాయిగా (NPA) మారింది. అయితే రూ.25 కోట్లను తిరిగి రాబట్టుకొనేందుకు ఎస్​బీఐ (SBI) నడుం బిగించింది. దీంతో రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్‌ ప్రాపర్టీని అధికారులు సీజ్‌ (seize) చేశారు. అప్పట్లో రూ. 25 కోట్లకు ఆ ప్రాపర్టీని అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ARC)కి ఎస్​బీఐ విక్రయించింది (Sold). ఇక్కడే కేసు కొత్త మలుపు తిరిగింది. దాని విలువ రూ.200 కోట్లని కేవలం రూ.25 కోట్లకే ఎలా అమ్ముతారని సదరు కంపెనీ కేసు వేసింది. మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించినట్లు​ ప్రతీప్​ చౌదరిపై 2015లో కేసు నమోదైంది.

    ఆర్​బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి కదా..

    ప్రతీప్‌ చౌదరి అరెస్టు ప్రేరేపితమైన, తీవ్రమైన చర్యని ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘ఏఆర్‌సీలకు ఆస్తులను విక్రయించడానికి ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే జరిగినట్లు సుస్పష్టం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది?’ అని కుమార్‌ ప్రశ్నించారు.



    కోర్టుకు సరిగా వివరించలేదు..

    స్టే‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందిస్తూ..  విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల క్రమం గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్‌ పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో ఎస్‌బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. 2014లో తమ బోర్డులో చేరిన చౌదరి తో సహా ఏఆర్‌సీ డైరెక్టర్లందరి పేర్లను ఈ కేసులో చేర్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. చౌదరి సెప్టెంబర్‌ 2013లో పదవీ విరమణ చేసినట్లు పేర్కొంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Arrested, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు