హోమ్ /వార్తలు /క్రైమ్ /

Adilabad:ఏడాదిలో జైలు నుంచి రిలీజ్ అవ్వాల్సినోడు..ఆ తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు

Adilabad:ఏడాదిలో జైలు నుంచి రిలీజ్ అవ్వాల్సినోడు..ఆ తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు

( ఖతర్నాక్ ఖైదీ )

( ఖతర్నాక్ ఖైదీ )

Adilabad:మరో ఏడాదిలో జైలు నుంచి బయటకు రావాల్సిన ఖైదీ పారిపోయి చిక్కుల్లో పడ్డాడు. 10సంవత్సరాల జైలుశిక్ష పడ్డ నాగోరావ్ అనే ఖైదీ 8ఏళ్లు జైలు జీవితం గడిపాడు. సత్ప్రవర్తన కారణంగా ఏడాది ముందే విడిచిపెడతామనుకున్నారు జైలు అధికారులు. ఇంతలోనే పారిపోయి శిక్షాకాలాన్ని మరింత పెంచుకున్నాడు.

ఇంకా చదవండి ...

(Lenin,Reporter, News18Telugu, Adilabad)

పదేళ్లు జైలుశిక్షపడిన ఖైదీ 8సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. సత్పవర్తనతో నడుచుకోవడంతో మరో రెండేళ్లు ఉన్న జైలుశిక్షను ఏడాదికి తగ్గించాలని అధికారులు భావించారు. ఇంతలోనే అతని జైలు నుంచి పారిపోయి అధికారులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పోక్సో చట్టం(Pocso Act)కేసులో పదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు నాగారావ్ (Nagarao).ఈనెల 24వ తేదిన ఆదిలాబాద్‌ (Adilabad)జిల్లా జైలు నుంచి అధికారుల కళ్లుగప్పి పారిపోయాడు. ఖైదీ నాగోరావ్ గత ఆరు నెలల నుండి ఔట్ గ్యాంగ్ లో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఇక్కడి పశువులకు మేత వేయడం, చేనులో చేయడంతో పాటు జైలులో ఖైదీలు పండించిన ఆకు కూరలు, కూరగాయలను కూడా అమ్ముకొని తిరిగి జైలుకు వస్తుండేవాడు. అతని సత్ప్రవర్తనగా నడుచుకోవడంతో అధికారులు అతనిపై పట్ల సహృదంతో వ్యవహరించాలని భావించారు. శిక్ష తగ్గించేందుకు ఆలోచిస్తుండగా పోలీసుల నమ్మకంపై దెబ్బకొట్టి పరార్ అయ్యాడు. నాగోరావ్ పారిపోవడం గమనించిన ఓ జవాన్ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదిలాబాద్ టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి అతడి కోసం గాలించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్( Jainath) మండలం కురా(Kura) గ్రామ సమీపంలో పట్టుకున్నారు. ఎందుకు పారిపోయామని జైలు అధికారులు ప్రశ్నిస్తే తన తోటి ఖైదీ భార్య బంధువును ఇంటి దగ్గర విడిచిపెట్టడానికి వెళ్లానని చెప్పినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

పారిపోతూ చిక్కిన ఖైదీ..

మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పర్సోడి గ్రామానికి చెందిన టేకం నాగారావ్‌పై ఆదిలాబాద్ జిల్లా తాంసి పోలీసు స్టేషన్ పోక్సో చట్టం కింద 2016 మార్చి 26న కేసు నమోదైంది. 2016 నవంబర్ 20 కోర్టు నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వరంగల్ జిల్లా జైలులో శిక్షను అనుభవించాడు. అయితే 2021 జూన్ 11న అతన్ని ఆదిలాబాద్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.

శిక్ష ముగిసే సమయానికి కొత్త ట్విస్ట్..

నేరస్తుడిగా ఉన్న నాగారావ్ నిజంగానే ఖైదీ బంధువుని ఇంటి దగ్గరకు వెళ్లాడా లేక పారిపోవాలని ప్రయత్నించాడో తెలియక జైలు అధికారులు తికమకపడుతున్నారు. ఇంతకాలం జైలు అధికారులు చెప్పిన పని చేసి సత్ర్పవర్తనతో నడుచుకున్న నాగారావ్‌కు శిక్ష గడువు తగ్గించాలని పోలీసులు భావించిన సమయంలో పారిపోయి కేసును మరింత జఠిలం చేసుకున్నాడని జైలు అధికారులు తెలిపారు. అయితే పారిపోయిన తర్వాత తోటి ఖైదీ బంధువుపై అత్యాచారం చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

First published:

Tags: Adilabad, Crime news

ఉత్తమ కథలు