హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: 20 ఏళ్ల ఈ యువకుడిలో ఇన్ని పాడు ఆలోచనలా.. ఇలా రోడ్డుపై ఒంటరిగా మహిళ కనిపిస్తే ఏం చేసేవాడంటే...

OMG: 20 ఏళ్ల ఈ యువకుడిలో ఇన్ని పాడు ఆలోచనలా.. ఇలా రోడ్డుపై ఒంటరిగా మహిళ కనిపిస్తే ఏం చేసేవాడంటే...

దినేష్ కుమార్ (ఫైల్ ఫొటో)

దినేష్ కుమార్ (ఫైల్ ఫొటో)

ఆ యువకుడి వయసు 20 సంవత్సరాలు. పేరు దినేష్ కుమార్. సొంతూరు తమిళనాడు రాజధాని నగరమైన చెన్నై. ఢిల్లీలో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు.

ఆ యువకుడి వయసు 20 సంవత్సరాలు. పేరు దినేష్ కుమార్. సొంతూరు తమిళనాడు రాజధాని నగరమైన చెన్నై. ఢిల్లీలో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు. ఎగ్మోర్‌లోని ఓ ఫేమస్ స్టార్ హోటల్‌లో పనిచేస్తూ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది గానీ నాణానికి మరో వైపులా ఇతనిలో మరో కోణం కూడా ఉంది.

ఆడవాళ్లంటే వ్యామోహం. వారి ప్రైవేట్ పార్ట్స్‌ను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతుండేవాడు. అతను పనిచేసేది స్టార్ హోటల్ కావడంతో మోడ్రన్‌గా ఉండే మహిళలు వస్తుండేవారు. వాళ్లకు తెలియకుండా వాళ్ల ప్రైవేట్ పార్ట్స్‌ను చూస్తూ దినేష్ పైశాచిక ఆనందం పొందేవాడు. అంతటితో కూడా అతనిలోని కామాంధుడు శాంతించలేదు. అతనికి బైక్ ఉంది. హోటల్‌లో పని ముగించుకున్న వెంటనే నేరుగా ఇంటికి వెళ్లేవాడు కాదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తారేమోనని రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఎదురుచూస్తుండేవాడు.

పొరపాటున ఒంటరిగా ఓ మహిళ వెళుతూ కనిపించిందా.. ఆమెను బైక్‌పై ఫాలో చేసి ఆమె శరీరంలోని పై భాగాలను నొక్కి.. ఆమె తేరుకుని గమనించే లోపే బైక్‌పై కంటికి కనిపించనంత వేగంతో వెళ్లిపోయేవాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి వారి వక్షోజాలను నొక్కుతూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఆకతాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దినేష్ ఎంత నీచానికి దిగజారాడంటే అతని ఇల్లు ఉన్న ప్రాంతమైన విల్లివక్కమ్ ప్రాంతం నుంచి ఎగ్మోర్ లోపు అతనికి తెలిసిన ఇరుగుపొరుగు మహిళలు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. అయితే.. దినేష్ ఇలానే ఓ యువతిని అడ్డగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. ఆ యువతి దినేష్‌ను అడ్డగించి కేకలేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి దినేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువత అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో దినేష్‌పై ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Shocking Twist: పెళ్లయిన మరుసటి రోజే ఈమె ఇచ్చిన ట్విస్ట్‌తో మైండ్ బ్లాంక్ అయింది.. ఇలా కూడా ఉంటారా..!

పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ నంబర్‌ను గుర్తించి, బైక్‌పై వెళుతూ వేధింపులకు పాల్పడుతోంది దినేషే అని తేల్చారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. దినేష్ కుమార్ నీలి చిత్రాలకు బానిసగా మారాడని, అతని ఫోన్‌లో అన్నీ మహిళల వక్షోజాలకు సంబంధించిన నీలి చిత్రాల వీడియోలే ఉన్నాయని తెలిపారు. అలా నీలిచిత్రాలు చూసి మహిళల ప్రైవేట్ భాగాలను తాకాలని దినేష్ భావించేవాడని.. అలాంటి ఆలోచనతోనే ఇలా మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడని చెప్పారు. దాదాపు గత సంవత్సర కాలంగా దినేష్ 100 మంది మహిళలను పైగా ఈ రీతిలో వేధించాడు. అయితే.. ఆ మహిళలు ఇతనిని గుర్తించి అడ్డగించే లోపు బైక్‌పై పారిపోయేవాడు. ఎవరికీ చెప్పుకోలేక బాధిత మహిళలు వాళ్లలో వాళ్లే కుమిలిపోయేవారు. ఎట్టకేలకు దినేష్ కుమార్ పాపం ఇన్నాళ్లకు పండింది. దినేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

First published:

Tags: Chennai, Crime news, Harassment on women, Sexual harrassment, Tamilnadu

ఉత్తమ కథలు