OMG: 65 ఏళ్ల అంకుల్‌ను పార్క్‌కు రమ్మని పిలిచింది.. ఆయన పార్క్‌కు రాగానే అలా పక్కకు వెళదామని చెప్పి..

నిందితురాలు, నిందితుడు

దేశంలో దాదాపు మెజార్టీ ప్రజలు కష్టపడి ఏదో ఒక పనిచేసుకుంటూ బతుకుతుంటే కొందరు మాత్రం ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ మోసాన్నే వృత్తిగా మలుచుకుంటున్నారు. జనాల బలహీనతలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 • Share this:
  ఇండోర్: దేశంలో దాదాపు మెజార్టీ ప్రజలు కష్టపడి ఏదో ఒక పనిచేసుకుంటూ బతుకుతుంటే కొందరు మాత్రం ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ మోసాన్నే వృత్తిగా మలుచుకుంటున్నారు. జనాల బలహీనతలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కొందరికి ఆదాయం పెంచుకోవచ్చంటూ డబ్బును ఎరగా వేస్తుంటే.. మరికొందరిపై వలపు వల విసిరి ఆ వీడియోలను, ఫొటోలను వైరల్ చేస్తామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి కొందరు మోసగాళ్లు బతికేస్తున్నారు. కానీ.. ఏ మోసం అయినా ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. ఆ మోసం చేసినందుకు శిక్షా తప్పదు. మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగుచూసిన ఓ ఘటనే అందుకు ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లో ఓ ముఠా కొత్త తరహా దందాకు తెరలేపింది. వయసు మీదపడి.. ఉద్యోగంలో రిటైర్మెంట్ తీసుకుని.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మగ వృద్ధులే వారి టార్గెట్. అలాంటి వారి ఫోన్ నంబర్లను సేకరించి తొలుత ఓ మహిళ స్వీట్‌గా మాటలు కలుపుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు పార్క్‌లో కలుద్దామంటూ సిగ్నల్ ఇస్తుంది. పొరపాటున ఆ ఓల్డ్ మ్యాన్ టెంప్ట్ అయ్యాడా.. ఇక అంతే సంగతులు. ఆ మహిళ చెప్పినట్టే పార్క్‌కు వస్తుంది. ఆ పెద్దాయనను పార్క్‌లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళుతుంది.

  వలపు వల విసిరి కవ్విస్తుంది. ఆ క్రమంలోనే.. కొందరు తాము పోలీసులమని సీన్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ వయసులో ఇవేం పనులంటూ.. పార్క్‌లో పాడుపనులు చేస్తున్నావని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి.. జైలుకి పంపుతామని ఆ వృద్ధుడిని బెదిరిస్తారు. ఈ వ్యవహారం అరెస్ట్ దాకా వెళ్లకుండా ఉండాలంటే కొంత డబ్బులిచ్చి సెటిల్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఇస్తారు. అలా రెండు లక్షలు ఇచ్చి తాను హనీ ట్రాప్‌లో చిక్కుకున్నానని తెలిసి మోసపోయిన ఓ 65 ఏళ్ల ఎల్‌ఐసీ ఏజెంట్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో.. ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్‌ఐసీ ఏజెంట్ అయిన తనకు ఓ అమ్మాయి ఫోన్ చేసి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటానని చెప్పిందని.. తనకు పరిచయం లేకపోయినప్పటికీ పాలసీ తీసుకుంటాననే సరికి ఆమెతో మాట్లాడానని ఆ 65 ఏళ్ల ఎల్‌ఐసీ ఏజెంట్ చెప్పాడు. అలా కొన్ని రోజులు ఆ వృద్ధుడితో ఆ మహిళ మాటలు కలిపింది.

  ఈలోపు.. అతనితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ కవ్వించింది. వీడియో కాల్స్ చేసి మరీ ఆకట్టుకుంది. ఆ మాటలకు పడిపోయిన ఆ పెద్దాయనను పూర్తిగా తన దారిలోకి రాగానే.. ఇండోర్‌లోని మేఘదూత్ గార్డెన్‌లో కలుద్దామని చెప్పింది. పూర్తిగా ఆమె మాయలో పడిపోయిన ఆ 65 ఏళ్ల వృద్ధుడు ఆమెను కలిసేందుకు ఆ పార్క్‌కు వెళ్లాడు. కొంతసేపటికి చెప్పినట్టుగానే ఆ మహిళ కూడా పార్క్‌కు వచ్చింది. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నాక నిర్మానుష్య ప్రదేశంలోకి వెళదామని ఆ మహిళ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి పార్క్‌లోనే ఎవరూ లేని చోటకు వెళ్లారు. ఆ పెద్దాయనను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లే పనిలో ఆ మహిళ ఉండగా సడన్‌గా కొందరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పారు. దీంతో.. ఆ పెద్దాయనకు గుండె ఆగినంత పనయింది.

  ఇది కూడా చదవండి: Lady Constable: అయ్యో దేవుడా.. ఏం తప్పు చేసిందని లేడీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈ యువతికి ఇంతటి శిక్ష..!

  ఆ మహిళతో ఆ వృద్ధుడు చనువుగా ఉండగా వీడియో తీసిన ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి.. తాము చెప్పినట్టు డబ్బులివ్వకపోతే వీడియోను నెట్‌లో పెట్టి వైరల్ చేస్తామని.. అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. రెండు లక్షలు డబ్బు డిమాండ్ చేశాడు. పరువు పోతుందని భావించి ఆ పెద్దాయన రెండు లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. చెప్పినట్టుగానే రెండు లక్షలను వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే.. ఇంటికెళ్లిన ఆ వృద్ధుడికి ఓ అనుమానమొచ్చింది. కేవలం తనను మాత్రమే బ్లాక్‌మెయిల్ చేశారని.. ఆ మహిళను కనీసం ఎవరు నువ్వని కూడా అడక్కపోవడం ఆలోచించేలా చేసింది. ఆ మహిళకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో.. ఆ మహిళ కూడా ఆ గ్యాంగ్‌లో సభ్యురాలేనని.. అసలు వాళ్లు పోలీసులే కాదని.. తనను బ్లాక్‌మెయిల్ చేశారని ఆ 65 ఏళ్ల ఎల్‌ఐసీ ఏజెంట్‌కు అర్థమైంది. పోలీసులను ఆశ్రయించడంతో ఆ గ్యాంగ్ బండారం బట్టబయలైంది. ఈ కుట్రలో ప్రధానంగా ఉన్న మహిళను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: