POLICE HAVE ARRESTED A RETIRED ASI WHO CHEATED ON AN OLD WOMAN WHO CAME TO SEEK SHELTER AT A NURSING HOME IN KAMAREDDY NZB PRV
Old age Home: ఆశ్రయం పొందేందుకు ఆశ్రమానికి వచ్చిన వృద్ధురాలిపై ఓ ఏఎస్ఐ ఎంతటి నీచానికి తెగబడ్డాడో తెలుసా?
నిందితుడిని మీడియాకు చూపుతున్న పోలీసులు
ఎంతో మంది రూపాయి కూడా ఆశించకుండా వృద్ద ఆశ్రమాలు నిర్వహిస్తు వృద్దులకు నీడనిస్తున్నారు. వృద్దులకు సేవ చేయాలనే మంచి ఉద్ధేశంతో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుంటే ఓ ఏఎస్ఐ లాంటి వారి వల్ల ఆ మంచి పనికి కలంకం అంటుతోంది..
పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినా.. చివరకు వృద్ధాప్యంలోకి తల్లి దండ్రులు రాగానే పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు.. అయితే వృద్దులకు ఆశ్రయం కల్పించేందుకు కొందరు మంచి మనసుతో వృద్ధాశ్రమాలు (Old age Home) ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఓ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వృద్ద ఆశ్రమం ముసుగులో చేసిన పని యావత్ సమాజాన్ని నివ్వెరపరిచింది. సాయం కోరి వచ్చిన వృద్దురాలి (Old woman) మూడు తులాల బంగారు గొలుసును తీసుకుని మోసం చేశారు. చివరకు వృద్దురాలు పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది..ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
కామారెడ్డి (kamareddy) జిల్లా మద్నూర్ మండలం పెద్దతడూరు గ్రామానికి చెందిన గంగవ్వ అనే వృద్దురాలు.. గత కొన్ని రోజుల క్రితం తన పిల్లలు సరిగా చూసుకోకపోవడం వలన కోడ్చిరా గ్రామా శివారుల్లో గల చెన్నమకోరి దేవస్థానం వద్ద ASI గా పనిచేసి పదవి విరమణ పొందిన బాలకృష్ణ చారి (Bala krishna chari) నిర్వహిస్తున్నా వృద్దాశ్రమo లో చేరింది.
కొద్దిరోజుల పాటు ఉండటానికి వెళ్లింది. అయితే గంగవ్వ వద్ద మూడు తులాల బంగారు తీగే (Gold chain).. లక్ష 20వేల రూపాయల నగదు ఉంది.. ఇది గమనించినా ఆశ్రమ నిర్వహకులు బాలకృష్ణాచారి, అతని కొడుకు శివచారి, భార్య భారతమ్మ లు పథకం ప్రకారం నీ వద్ద ఉంటే ఎవరైన తీసుకుంటారు.. నీవు మీ ఇంటికి వెళ్లే సమయంలో ఇస్తామని నమ్మబలికారు.. గంగవ్వ వారి మాటలు నమ్మి తన వద్ద ఉన్న మూడు తులాల బంగారు గొలుసు , లక్ష 20వేల నగదు వారికి ఇచ్చింది. అయితే ఆ బంగారం తీగ, డబ్బులు తిరిగి ఇవ్వమంటే నీవు మాకు ఎప్పుడిచ్చావు.. మా వద్ద ఏక్కడివి అని బుకాయించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపివేస్తామని బెదిరించారు.
బంగారం తనఖా పెట్టి..
దీంతో భయాందోళనకు గురైన గంగవ్వ తన పిల్లల సహయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. వృద్ద ఆశ్రమ నిర్వహకుడు మాజీ ఏఎస్ఐ బాలకృష్ణ చారి గంగవ్వ వద్ద నుంచి మోసపూరితంగా తీసుకున్న బంగారు తీగను, బాలాజీ మహాజన్ అనే వ్యక్తి వద్ద తనఖా పెట్టి 1 లక్ష 20 వేల రూపాయలు తీసుకొని తమ సొంత అవసరాలకు వాడుకునట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ శికుమార్ తెలిపారు. మూడు తులాల బంగారు గొలుసు (Gold chain)ను స్వాధీన పరచుకొని బాలకృష్ణాచారి, అతని కొడుకు శివచారి లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ వివరించారు.
ఎంతో మంది రూపాయి కూడా ఆశించకుండా వృద్ద ఆశ్రమాలు నిర్వహిస్తు వృద్దులకు నీడనిస్తున్నారు. వృద్దులకు సేవ చేయాలనే మంచి ఉద్ధేశంతో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుంటే బాల కృష్ణాచారి లాంటి వారి వల్ల ఆ మంచి పనికి కలంకం అంటుతోంది.. కొందరు చేసే చెడు చాలా మంది మంచివారికి శాపంగా మారుతుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.