ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసగించే వాళ్లు ఇప్పటికీ ఎలాంటి భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి.. అంతకుముందే అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి మాజీ ప్రియురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు తరలించారు. ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కూడా నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాష్‌పూర్‌లోని గార్డెన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల యువతి మే 20న పోలీస్ స్టేషన్లో తన ప్రియుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
సురేంద్ర కుమార్ విశ్వకర్మ తన కోరికకు విరుద్ధంగా తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అనేకసార్లు అతడి ఈ రకంగా వ్యవహరించాడన్నది యువతి ఆరోపణ. ఫిర్యాదు ప్రకారం, 15 మే 2019న సురేంద్ర తనతో పాటు రాయ్‌పూర్‌కు అమ్మాయిని తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడ సురేంద్ర పలుమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని సురేంద్రను యువతి కోరింది.
పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చిన సురేంద్ర.. చివరకు నిన్న పెళ్లి చేసుకోవడం కుదరదని ఆమెకు తేల్చిచెప్పాడు. మరో అమ్మాయితో పెళ్లికి సన్నాహాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న విషయం యువతికి తెలిసింది. ఇదేమిటని అతడి ఆమె నిలదీయడంతో సురేంద్ర ఆగ్రహం కట్టలు తెంచుకున్నాడు. చంపేస్తానని యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు.
యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 376 (2) (N), 506 నేరం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఇన్ఫార్మర్ నివాసంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సురేంద్ర కుమార్ విశ్వకర్మను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో జైలుకు పంపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.