హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: ఎందుకిలా చేస్తార్రా బాబూ.. అయినా ఇదేం పని.. ఆ నడుచుకుంటూ వెళ్లిపోతున్న అమ్మాయి ఎవరో తెలిస్తే...

Shocking Incident: ఎందుకిలా చేస్తార్రా బాబూ.. అయినా ఇదేం పని.. ఆ నడుచుకుంటూ వెళ్లిపోతున్న అమ్మాయి ఎవరో తెలిస్తే...

దివ్య, సత్యమూర్తి, అతని ప్రియురాలు అర్చన

దివ్య, సత్యమూర్తి, అతని ప్రియురాలు అర్చన

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే గుడికి తీసుకెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప పుట్టింది. భార్యపై ప్రేమ తగ్గింది. ఈ క్రమంలోనే భార్య మేనకోడలితో పరిచయం పెరిగింది.

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే గుడికి తీసుకెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప పుట్టింది. భార్యపై ప్రేమ తగ్గింది. ఈ క్రమంలోనే భార్య మేనకోడలితో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భార్యను వదిలేసి ఆమె మేనకోడలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వదిలించుకునేందుకు ప్లాన్ చేసి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భర్తను, ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని పూన్‌కుళం అనే గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూన్‌కుళం గ్రామానికి చెందిన సత్యమూర్తి అనే 32 ఏళ్ల యువకుడు ఎలవంపట్టి ఆర్‌టీవో ఆఫీస్ దగ్గర్లో ఓ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నాడు. మూడేళ్ల క్రితం డ్రైవింగ్ నేర్చుకునేందుకు దివ్య అనే 24 ఏళ్ల యువతి అతని డ్రైవింగ్ స్కూల్‌లో చేరింది. అలా ఆమెతో పరిచయం పెంచుకున్న సత్యమూర్తి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడింది. అలా ఇద్దరి మధ్య మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ నడిచాయి. ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. భార్యాభర్తలు కాక ముందే శారీరకంగా కలిసేంతలా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని దివ్య ఒత్తిడి చేయడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా దివ్యను తీసుకెళ్లి తిరువన్నమలై ఆలయంలో సత్యమూర్తి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దివ్య ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. తొలుత దివ్య కుటుంబం ఆమె ప్రేమ పెళ్లిని వ్యతిరేకించినప్పటికీ ఓ పాప పుట్టాక మెత్తబడ్డారు. పాపను చూసుకునేందుకు ఇబ్బందిపడుతున్నామని దివ్య తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో పాపతో సహా దివ్యను పుట్టింటికి తీసుకెళ్లి చూసుకుంటున్నారు.

సత్యమూర్తి ఈ క్రమంలోనే తరచూ దివ్య ఇంటికి వెళుతుండేవాడు. ఆ సమయంలో.. దివ్య మేనకోడలు అర్చనతో సత్యమూర్తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా చనువుగా మారింది. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. అర్చన చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో నర్సింగ్‌ చదువుతోంది. అర్చన తన భార్య కంటే అందంగా ఉండటంతో ఆమెతో సెటిల్ అయిపోవాలని సత్యమూర్తి నిర్ణయించుకున్నాడు. అందుకు తన భార్య అడ్డుగా ఉందని భావించాడు. ప్రియురాలితో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తన రెండు కిడ్నీలు పాడయిపోయాయని.. కలిసి బతికే అవకాశం లేని మనం కలిసి చనిపోదామని భార్య దివ్యతో సత్యమూర్తి చెప్పాడు. అయితే.. ఆత్మహత్యకు దివ్య నిరాకరించింది. మనకు ఒక పాప ఉందని.. తల్లిదండ్రులమైన మనం చనిపోతే పాపను ఎవరు చూసుకుంటారని భర్తను అడిగింది. ఈ విషయంలో సత్యమూర్తి, దివ్య మధ్య గొడవ జరిగింది. ‘ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకోకపోతే నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టి నేనూ చనిపోతా’ అని భార్యను సత్యమూర్తి బెదిరించాడు. ఇలా జరిగిన కొన్నిరోజులకు.. భార్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న సత్యమూర్తి తల్లి గారింట్లో ఉన్న దివ్యను గుడికెళదామని చెప్పి పాపతో సహా కారులో తీసుకెళ్లాడు.

ఇది కూడా చదవండి: Medak: భార్య అతనితో వెళ్లిపోయిందని భర్త ఇలా మారిపోయాడు.. మరీ ఇలా తయారయ్యాడేంటి.. ఏం చేశాడంటే...

దివ్యకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పాపతో పరారయ్యాడు. మంటల్లో కాలిపోతున్న దివ్యను గమనించిన కొందరు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ దివ్య చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సత్యమూర్తి కోసం వెతుకుతున్న పోలీసులకు అతను విడుదల చేసిన వీడియో కనిపించింది. తన రెండు కిడ్నీలు పాడయ్యాయని, అందుకే తన భార్యను చంపేసి.. తన పాపతో కలిసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ వీడియోలో సత్యమూర్తి చెప్పాడు. అతని ఆచూకీ కోసం చెన్నై, బెంగళూరు, ఏపీలో పోలీసు బృందాలు వెతకగా.. ఎట్టకేలకు కొన్ని రోజుల తర్వాత సత్యమూర్తి తంజావూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితో పాటు తన ప్రియురాలు అర్చన కూడా ఉంది. తామిద్దరం భార్యాభర్తలమని, ఈ పాప తమ కూతురని చెప్పి తంజావూరులో ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త లైఫ్ మొదలుపెట్టిన ఈ హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ప్రియురాలు అర్చనను కూడా అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Chennai, Crime news, Husband kill wife, Tamilnadu, Wife murdered

ఉత్తమ కథలు