హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tamilnadu: ఎమ్మెల్యే టికెట్​ రూ.50 లక్షలు .. కేంద్ర మంత్రి మాజీ సహాయకుడి చేతివాటం

Tamilnadu: ఎమ్మెల్యే టికెట్​ రూ.50 లక్షలు .. కేంద్ర మంత్రి మాజీ సహాయకుడి చేతివాటం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ( Tamilnadu Assembly elections) ఎమ్మెల్యే టికెట్‌ (MLA Ticket) తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం (cheat) చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ( Tamilnadu Assembly elections) ఎమ్మెల్యే టికెట్‌ (MLA Ticket) తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం (cheat) చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆ వ్యక్తి సాక్ష్యాత్తు ఓ కేంద్ర మంత్రి (Union minister)  మాజీ సహాయకుడు కావడం గమనార్హం.  ఆ వ్యక్తి పేరు నరోత్తమన్ (narothaman). ఇదే కేసులో అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్టు (arrest) చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి జయలక్ష్మినగర్‌కు చెందిన బీజేపీ నేత భువనేష్‌ కుమార్‌ (Bhuvanesh kumar) (29) చెన్నై పాండిబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జూలైలో ఓ ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడానికి రూ.కోటి..

బీజేపీ నేత భువనేష్‌ కుమార్‌ ఫిర్యాదులో..  “మా చిన్నాన్న కుమార్తె వసంతి (vasanti)కి ఆరణి టికెట్‌ కోసం పెరంబూరుకు చెందిన విజయరాఘవన్‌ సంప్రదించాం. అతని ద్వారా బీజేపీ రాష్ట్ర (tamilnadu) ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి సహాయకుడు (Union minister assistant) నరోత్తమన్‌ను కలిశాం. అతను ఎమ్మెల్యే టికెట్‌ తీసివ్వడానికి రూ.కోటి ఇవ్వాలని కోరారు. తొలుత రూ.50 లక్షలు (lakhs) ఇవ్వాలని.. అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత మిగిలిన రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో నగదు(money) ఇచ్చాను. జాబితాలో పేరు (name) లేకపోవడంతో నగదు తిరిగి ఇవ్వమని కోరినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో నరోత్తమన్‌తో పాటు అతని తండ్రి చిట్టిబాబు (Chitti babu), విజయరాఘవన్‌పై చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని’  పేర్కొన్నారు.

నరోత్తమన్‌ను తొలగించిన మంత్రి..

ఈ క్రమంలో కేంద్రమంత్రి నరోత్తమన్‌ను తొలగించారు. పాండిబజార్‌ (pandi bazar) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని నరోత్తమన్, చిట్టబాబును అరెస్టు చేసి శనివారం చెన్నై (Chennai)కి తీసుకొచ్చారు.

కాగా, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. 234 సీట్లున్న తమిళనాడు (Tamilnadu)లో డీఎంకే కూటమి 159 సీట్లు సాధించింది. ఇందులో ఒక్క డీఎంకేకే 133 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమయింది. ఇక అన్నాడీఎంకే 66 సీట్లతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే మిత్రపక్షాలైన బీజేపీ 4, పీఎంకే 5 చోట్ల గెలుపొందాయి.

తండ్రి కరుణానిధి మరణంలో 2018లో ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టారు స్టాలిన్. అప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించారు. హిందీ బాషతో పాటు నీట్, జయలలిత మరణంపై మాటల తూటాలు పేల్చి.. రాజకీయాలను హీటెక్కించారు స్టాలిన్. పళని, పన్నీర్‌ గెలిస్తే రాష్ట్రం బాగుపడదని.. ఇన్నేళ్లలో వారు ఏం చేశారో ఆలోచించుకోవాలని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. మరోవైపు అన్నాడీఎంకేలో చీలికలు కూడా డీఎంకేకు కలిసొచ్చాయి.

First published:

Tags: Bjp, Cheating, Tamil nadu, Tamil Nadu Assembly Elections 2021

ఉత్తమ కథలు