Home /News /crime /

Husband: అది ఫోనా లేక.. భర్త ఫోన్ చూడటమే ఈమె చేసిన పాపమైంది.. ఎంత పని జరిగింది దేవుడా..

Husband: అది ఫోనా లేక.. భర్త ఫోన్ చూడటమే ఈమె చేసిన పాపమైంది.. ఎంత పని జరిగింది దేవుడా..

హేమలత, వినోద్ (ఫైల్ ఫొటో)

హేమలత, వినోద్ (ఫైల్ ఫొటో)

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. పలువురు మహిళలతో అఫైర్ నడుపుతున్న భర్త ఇదేంటని నిలదీసిన భార్యను చంపేశాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి మీ కూతురు ఉన్నట్టుండి కిందపడిపోయిందని.. నోటి నుంచి నురగ వస్తోందని చెప్పాడు.

    చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. పలువురు మహిళలతో అఫైర్ నడుపుతున్న భర్త ఇదేంటని నిలదీసిన భార్యను చంపేశాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి మీ కూతురు ఉన్నట్టుండి కిందపడిపోయిందని.. నోటి నుంచి నురగ వస్తోందని చెప్పాడు. అల్లుడిపై అనుమానంతో పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వెల్లలార్ వీధికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుడు ఆరేళ్ల క్రితం హేమలత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఈ భార్యాభర్తలకు ఐదేళ్ల వయసున్న కూతురు కూడా ఉంది. వినోద్‌కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్య హేమలతకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.

    భర్త ప్రవర్తనతో విసిగిపోయిన హేమలత కొన్ని నెలల క్రితం కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయి ఉంటోంది. అయితే.. ఇరు కుటుంబాలు భార్యాభర్తల మధ్య సయోధ్యను కుదిర్చి ఇద్దరూ కలిసి ఉండేలా చేశారు. దీంతో.. కొన్ని రోజుల నుంచి హేమలత మళ్లీ భర్తతో కలిసి ఉంటోంది. అయితే.. ఇకనైనా భార్యతో కలిసి చక్కగా కాపురం చేసుకోవాల్సిన వినోద్ కొన్ని రోజుల తర్వాత మళ్లీ మహిళలతో ఫోన్లు, వీడియో కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల ఒకరోజు భర్తకు తెలియకుండా అతని ఫోన్‌ను చెక్ చేసిన హేమలత అందులో కనిపించిన ఫొటోలు, వీడియోలు చూసి షాకైంది. పలువురు మహిళలతో వినోద్ గడిపిన ఫొటోలు, వీడియోలు కనిపించడంతో పాటు కొందరు అమ్మాయిల సెమీ న్యూడ్ వీడియోలు ఆమె కంటపడ్డాయి. ఆ ఫొటోలు, వీడియోలు చూసిన హేమలత తట్టుకోలేక భర్తతో గొడవ పెట్టుకుంది. మారావనుకుని కలిసి ఉంటున్నానని, ఎప్పటికీ మారవని తెలిసిందని వినోద్‌తో హేమలత మనస్తాపంతో చెప్పింది.

    ఇది కూడా చదవండి: Shocking: రోజులెలా తయారయ్యాయో చూడండి.. అర్ధరాత్రి సమయంలో ఈమె ఎవరికి ఫోన్ చేసి.. ఏం చెప్పిందంటే..

    ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశానికి లోనైన వినోద్ భార్యను గొంతు పిసికి చంపేశాడు. భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అత్తింటి వారిని నమ్మించాలనుకున్నాడు. ఆమె నోటి వెంట నురగ వచ్చేలా చేసి.. మీ కూతురు ఉన్నట్టుండి నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయిందని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రికి తీసుకెళుతున్నానని చెప్పాడు. అయితే.. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో హేమలత తల్లిదండ్రులకు అల్లుడిపై అనుమానం వచ్చింది. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని, అల్లుడే చంపి నాటకాలాడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవం వెలుగులోకి వచ్చింది. తన భార్యను తానే చంపేసినట్లు వినోద్ అంగీకరించాడు. పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్థానికులను ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: AP News, Chennai, Crime news, Tamilnadu, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు