Home /News /crime /

POLICE HAS NO CLUE IN WOMAN MYSTERIOUS DEATH IN SRIKAKULAM DISTRICT PRN

Crime: ఆమెను చంపిందెవరు..? పోలీసులకే సవాల్ విసిరిన హంతకులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శ్రీకాకుళం జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. హత్య జరిగిన స్థలంలో మద్యం బాటిల్ దొరకడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అత్యాచారం చేసి చంపేశారా అని కోణలోనూ విచారణ జరుపుతున్నారు.

  ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, చిన్నపల్లివూరులో జరిగిన వివాహిత రచ్చస్వాతి అనుమానాస్పద మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకు కేసు తేలలేదు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం, గురదాసుపురానికి చెందిన రచ్చ స్వాతికి మూడేళ్ల క్రితం చిన్నవూరుపల్లికి చెందిన దినేష్ తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడున్నాడు. ఈనెల 11న ఉదయం ఆస్పత్రికి వెళ్లిన స్వాతి మధ్యాహ్నం ఇంటికి చేరుకుంది. పశువులు మేపడానికి వళ్లిన ఆమె అత్తమామలు అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చారు. సమయంలో స్వాతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం చూసి మందలించారు. రాత్రి ఏడుగంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన స్వాతి ఎంతసేపటికి రాలేదు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు సమీపంలోని తోటలో గాలించగా.. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అంబులెన్స్ లో పలాస ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ కుతరలిస్తుండా మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది.

  స్వాతి తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్వాతి బహిర్భూమికి వెళ్లిన తోటను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనాస్థలిలో స్వాతి బంగారు చెవి దిద్దులు, జడ క్లిప్,చెప్పులు లభ్యమయ్యాయి. కొద్దిదూరంలో రక్తపు మరకలతో పాటు ఖాళీ మద్యం సీసాను కూడా క్లూస్ టీమ్ సేకరించింది. కానీ స్వాతి సెల్ ఫోన్ మాత్రం అక్కడ కనిపించలేదు. ఫోన్ చేసినా అ స్విచ్ ఆఫ్ వస్తోంది.దీంతో పోలీసులు కాల్ డేటా సేరించే పనిలో ఉన్నారు.

  విచారణ ముమ్మరం
  స్వాతి కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. స్వాతి అత్తమామలు, ఆడపడుచుతో పాటు అనుమానితులను ప్రశ్నించారు. ఇంతవరకు హంతకులకు సంబంధించిన చిన్న సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. డాగ్ స్క్వాడ్ ను రప్పించినా ఫలితం లేకపోయిందని పోలీసులు చెప్తున్నారు. ఇది హత్యా, లేక అత్యాచారం చేసి చంపేశారా అనేది ఇంకా తేలడం లేదు. అత్యాచారానికి సంబంధించిన అనవాళ్లు కూడా ఘటనాస్థలిలో లేవు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కేసులో మరింత ముందుకెళ్లొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

  ఎన్నో అనుమానాలు..?
  స్వాతి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వాతి ఫోన్లో మాట్లాడుతుండగా మందలించినట్లు అత్తమామలు చెప్తుండటంతో ఆమె ఎవరితో మాట్లాడిందనే దానిపై ఆరా తీస్తున్నారు. స్వాతి సెల్ ఫోన్ కనిపించకపోవడం, ఘటనాస్థలిలో మద్యం బాటిల్ దొరకడంతో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. స్వాతి బహిర్భూమికి వెళ్లిన చోట ఎవరైనా మద్యం తాగుతూ ఉంటే.. వారే ఆమెపై దాడి చేసి దిద్దులు ఎత్తుకెళ్లే ప్రయత్నంలో హత్య చేశారా అని కూడా అనుమానిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Murder, Rape and murder, Srikakulam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు