Home /News /crime /

POLICE FOUND WOMAN DEAD BODY IN DRAINAGE IN KARIMNAGAR THREE PERSONS IDENTIFIED IN CCTV VIDEO HSN

మురుగు కాల్వలో మర్డర్ మిస్టరీ.. సీసీ కెమెరా ఫుటేజీ బయటకు.. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో..

మురికి కాలవలోంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

మురికి కాలవలోంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాతోపాటు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఆ మురుగు కాలవలోకి ఒకరు దూరడమే కష్టం. అలాంటిది ఆమె మృతదేహాన్ని అందులో ఎలా పడేశారా? అన్నది పలు సందేహాలకు తావిస్తోంది.

    కరీంనగర్ పట్టణంలోని కోర్టు బస్టాప్ పక్కన ఓ మురికి కాలువలో వివాహిత మృతదేహం లభ్యమయిన సంగతి తెలిసిందే. రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఏకంగా బస్టాప్ పక్కనే ఆమె మృతదేహాన్ని పడేయడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడైనా చంపి ఆమెను అక్కడ పడేశారా? లేక అక్కడే ఆమెను చంపేశారా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించగా, రాత్రి అయినప్పటికీ నిందితులు ఎవరో తెలియరాలేదు. దీంతో ఘటనలో కీలక ఆధారమైన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద మంగళవారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం అయ్యింది. కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద జగిత్యాల వెళ్లే బస్టాప్ పక్కనే ఓ మురికి కాలవ ఉంది. ఓ ఆటో డ్రైవర్ ఆమె మృతదేహాన్ని చూసి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

    కాగా, పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకే మృతదేహాన్ని కాలువ లోపలి వైపునకు తోసిసినట్టు పోలీసులు గుర్తించారు. దగ్గరగా వెళ్లి చూస్తే తప్ప మురికి కాలువలో మృతదేహం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాతోపాటు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఆ మురుగు కాలవలోకి ఒకరు దూరడమే కష్టం. అలాంటిది ఆమె మృతదేహాన్ని అందులో ఎలా పడేశారా? అన్నది పలు సందేహాలకు తావిస్తోంది.
    ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

    ఆమె వయసు 30 నుంచి 40 మధ్య ఉంటుందనీ, ఛామనచాయ రంగు, గులాబీ కుర్తా, పైజమా, నీల రంగు ప్యాంటు ధరిచి ఉందనీ, సిలువ బొమ్మతో పుస్తెల తాడు కూడా ఉందనీ, ఎడమ చేయిపై టాటూ కూడా ఉందని ఆమె ఆనవాళ్లను పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై ఎలాంటి గాయలు లేవని తేల్చారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, తెల్లవారుజామున 4.30 గంటల సమయం నుంచి 5.15 గంటల సమయంలో ఆమె అదే ప్రాంతంలో తిరిగినట్టు కనిపించింది. ఆమె వద్దకు మొదటగా ఓ వ్యక్తి, ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడారు. ఆ ముగ్గురే ఆ మహిళను ఉదయం 5.15 గంటల తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Karimnagar, Wife kill husband

    తదుపరి వార్తలు