Hyderabad: అద్దెకు ఇచ్చిన ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. అనుమానంతో తాళం పగలగొట్టి మరీ చూసిన యజమానికి షాక్.. ఫ్రిజ్ లో..

ప్రతీకాాత్మక చిత్రం

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన బయటపడింది. ఓ అపార్ట్మెంట్ లో ఓ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. దానికి తాళం వేసి మరీ ఉండటంతో ఆ అపార్ట్మెంట్ యజమాని పోలీసులకు ఫోన్ చేస్తే..

  • Share this:
    అదో అపార్ట్మెంట్. అందులో ఓ ఇంటికి తాళం వేసి ఉంది. సడన్ గా ఆ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. పక్కింటి వాళ్లు అపార్ట్మెంట్ యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి మరీ చూశారు. ఇంట్లో ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఎక్కడి సామాను అక్కడ చక్కగా సర్ది ఉన్నాయి. చివరకు అనుమానంతో ప్రిజ్ ను ఓపెన్ చేసి చూశారు. అంతే, ఒక్కసారిగా షాకయ్యారు. ఆ ఫ్రిజ్ లో ఓ శవం బయటపడింది. ఓ వ్యక్తిని చంపి, ప్రిజ్ లో కుక్కి మరీ ఆ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని తెలిసింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ లో సిద్దిఖ్ అహ్మద్ అనే 38 ఏళ్ల వ్యక్తి తన భార్య రుబీనా, పిల్లలతో సహా ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నాడు. రెండు రోజుల క్రితమే రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే టప్పుడు ఇంటికి తాళం వేసి మరీ వెళ్లింది. గురువారం సడన్ గా ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. దీంతో పక్కింట్లో ఉండే వాళ్లు ఆ అపార్ట్మెంట్ యజమానికి సమాచారం ఇచ్చారు. ఆ యజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసుల సమక్షంలో ఆ ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. ఆ ఇంట్లో ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ దుర్వాసన మాత్రం ఆ ఇంట్లో నుంచే వస్తుండటంతో క్షుణ్ణంగా వెతికారు. చివరకు ప్రిజ్ లో ఓ శవాన్ని గుర్తించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

    ఆ మృతదేహం సిద్దిఖ్ అహ్మద్ దే అని యజమాని గుర్తించాడు. దీంతో ఆ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయా? ఈ హత్యకు భార్యకు సంబంధం ఉందా? వివాహేతర సంబంధం ఏమైనా ఈ ఘటనకు కారణమా? ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. పుట్టింటికి వెళ్లిన భార్యకు, భర్త మరణం గురించి సమాచారం అందించారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు త్వరలోనే పిలిపిస్తామనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
    ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!
    Published by:Hasaan Kandula
    First published: